ముస్లిం తాటి చెట్ల పాలెం లో ఘనంగా ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలు

జీవీఎంసీ 44 వ వార్డు ముస్లిం తాటి చెట్ల పాలెం లో మస్జీద్ ఎ క్యూబా కమిటీ మరియు ఖుద్దామే గరీబ్ నవాజ్ కమిటీ ఆధ్వర్యంలో జష్నె ఈద్ మిలాద్ ఉన్ నబి ( మహమ్మద్ ప్రవక్త వారి జన్మదిన) వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శనివారం సాయంత్రం మగ్రిబ్ నమాజ్ అనంతరం సాయంత్రం 6:30 గంటలకు ఉత్తరప్రదేశ్ నుండి విచ్చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు హజరత్ అల్లామా మౌలానా సగీర్ అహ్మద్ సహాబ్ వారి ప్రసంగం అత్యంత శోభాయమానంగా జరిగింది. ఈ ప్రసంగంలో మహమ్మద్ ప్రవక్త వారి జీవిత చరిత్ర, ఆయన పరుల పట్ల చూపిన ప్రేమ, ఆయన మానవాళికి ఇచ్చిన సందేశం, మనిషి తన జీవితంలో సత్ప్రవర్తనతో ఏ విధంగా జీవించాలి, సమాజంలో పరులపట్ల ఏ విధంగా ప్రేమానురాగాలతో మెలగాలి, తదితర అంశాలను క్లుప్తంగా వివరించారు. మస్జీద్ ఎ క్యూబా అధ్యక్షులు మొహమ్మద్ హబీబ్, సెక్రటరీ మహమ్మద్ యాసీన్, మస్జిద్ ఇమామ్ మహమ్మద్ ముస్తేజాబ్ , ఖుద్దామే గరీబ్ నవాజ్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ జలాలుద్దీన్ బుఖారి, సెక్రటరీ మహబూబ్ అలీ (బుజ్జి), లు విచ్చేసిన ఆధ్యాత్మిక గురువు సగీర్ అహ్మద్ వారిని పూలదండలు శాలువులతో సత్కరించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ నలుమూలల నుండి వేలాది సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు.




