మతంవిశాఖపట్నం
ముస్లిం తాటిచెట్ల పాలెంలో ఘనంగా హజరత్ కరీముల్లాషా ఖాద్రి ఔలియా వారి ఉర్సు వేడుకలు

జీవీఎంసీ 44 వార్డు ముస్లిం తాటి చెట్ల పాలెం లో హజరత్ కరీముల్లాషా ఖాద్రి ఔలియా వారి ఉర్సు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. గురువారం సాయంత్రం అసర్ నమాజు అనంతరం 5:00 గంటలకు దైవ గ్రంథం ఖురాన్ పఠనం జరిగింది. మగ్రిబ్ నమాజు అనంతరం సాయంత్రం 7:30గంటలకు ఫాతేహా దరూద్, ప్రత్యేక ప్రార్ధనలు జరిపి బాబా వారి జెండాను . ఆవిష్కరించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మతాలకు అతీతంగా పాల్గొన్నారు.




