మతంవిశాఖపట్నం

హజరత్ బాబా సయ్యద్ షాహబుద్దీన్ ఔలియా వారి దర్గాలో ఈనెల 25న ఘనంగా గ్యార్వి షరీఫ్ వేడుకలు

విశాఖపట్నం పాత పోస్ట్ ఆఫీస్ ఫెర్రీ రోడ్ లో ఉన్న హజరత్ బాబా సయ్యద్ షహబుద్దీన్ ఔలియా వారి దర్గాలో ఈనెల 25 శుక్రవారం నాడు హజరత్ గౌసుల్ ఆజమ్ దస్తగీర్ వారి గ్యార్వీ షరీఫ్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం 4:.00 గంటలకు దైవ గ్రంథం ఖురాన్ పఠనం,5:15 గంటలకు సందల్( గంధం) తయారీ,6:00 గంటలకు నిషాని జెండా ఆవిష్కరణ ఫాతేహ దరూద్( (ప్రత్యేక ప్రార్థనలు) అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరగనున్నట్లు  నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బాబా వారి దివ్య ఆశీస్సులు పొందాలని ట్రూ న్యూస్ ముఖంగా కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!