రాజకీయాలురాష్ట్రంవిశాఖపట్నం

డి ఎస్సి పై విశాఖలో పోరు విద్యార్థుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు కె.కె. రాజు

విశాఖపట్నం, జూలై 28(ట్రూ న్యూస్ ) రాష్ట్రంలో డీఎస్సీ నియామకాలలో జరిగిన అక్రమాలు, నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులుకె.కె. రాజు పాల్గొన్నారు..

జి.వి.ఎం.సి. ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం నుంచి ఎల్‌ఐసీ భవనం వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ జరిగింది.

ఈ సందర్భంగా కె.కె. రాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నియామకాల ప్రక్రియలో తీవ్ర అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి, విద్యార్థులకు మెరుగైన అవకాశాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. డీఎస్సీ పరీక్షలకు సుమారు మూడు లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులు తీవ్ర శ్రమతో పరీక్షలు రాశారని, ఫలితాల విడుదల అనంతరం మెరిట్ జాబితాలో మార్పులు చేసి అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ అక్రమాల కారణంగా అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. డీఎస్సీ వ్యవహారంలో జరిగిన అవకతవకలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని కె.కె. రాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని తీవ్రంగా విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత న్యాయమైన డిమాండ్లకు పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని తెలిపారు. వారికి న్యాయం జరిగే వరకు పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చెప్పిన హక్కుల సాధన స్ఫూర్తిని, మహాకవి శ్రీశ్రీ చెప్పిన “పోరాడితే పోయేదేమీ లేదు… బానిస సంకెళ్లు తప్ప” అనే సందేశాన్ని గుర్తు చేస్తూ, విద్యార్థులు, యువత అంతా ఐక్యంగా ఉద్యమాల్లో పాల్గొని తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

 

జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఉరుకుటి రామచంద్రరావు మరియు రాష్ట్ర విద్యార్ధి విభాగం కార్యనిర్వాహక అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీ వాత్సవ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలు అత్యంత ఆందోళనకరమని విమర్శించారు.డీఎస్సీ–2025లో మొత్తం 16 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టగా, అందులో స్పోర్ట్స్ కోటా కింద 421 ఉపాధ్యాయ పోస్టులను రాత పరీక్ష లేకుండానే కేవలం క్రీడా ప్రతిభ, సర్టిఫికెట్ల ఆధారంగా భర్తీ చేశారని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నియమావళిని మార్చి కొత్త జీవోలు జారీ చేసిందన్నారు. ఈ నియామకాలలో కనీస విద్యార్హత అయిన డిగ్రీ లేకపోయినా, టెట్ అర్హత సాధించకపోయినా, కేవలం శాప్ సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు కల్పించడం దేశంలోనే ఎక్కడా కనిపించని విధానమని వారు విమర్శించారు. తమకు అనుకూలంగా నియామకాలు పూర్తి చేసిన అనంతరం, అదే ప్రభుత్వం ఆ జీవోలను రద్దు చేసి, పాత నియమావళిని పునరుద్ధరిస్తూ మళ్లీ కొత్త జీవోలు జారీ చేయడం వెనుక ఉన్న ఉద్దేశంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు.

 

ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు మళ్ల విజయ ప్రసాద్, తిప్పల శ్రీనివాస్ రెడ్డి, మొల్లి అప్పారావు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మాజీ శాసన సభ్యులు చింతలపూడి వెంకట రామయ్య, పార్టీ కార్యాలయం పర్యవేక్షకులు రవి రెడ్డి , యువజన విభాగం నాయకులు అంబటి శైలేష్,బాణాల తరుణ్ కుమార్ , పార్టీ నాయుకులు జహీర్ అహ్మద్, కటుమూరి సతీష్, బాణాల శ్రీనివాసరావు, కొండ రాజీవ్ గాంధీ,కటారి అనిల్ కుమార్, మొహమ్మద్ ఇమ్రాన్, బర్కత్ అలీ, సేనాపతి అప్పారావు, బోని శివ రామకృష్ణ, బొడ్డేటి కిరణ్ కుమార్, మహమ్మద్ అబ్దుల్లా షకీల్, ఎం డి ముజీబ్ ఖాన్, వై ఎస్ ఆర్ సీపి విశాఖపట్నం జిల్లా యువజన విభాగం అధికార ప్రతినిధి మహమ్మద్ ఇమ్రాన్ , విశాఖ జిల్లా మైనారిటీ సెక్రటరీ మహమ్మద్ కరీమ్,విశాఖ జిల్లా వై ఎస్ ఆర్ సీపీ ప్రచార విభాగం నాయకులు షేక్ బాష తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!