మతంవిశాఖపట్నం

ఈ నెల 10 వ తేది నుండి  విశాఖపట్నం,అక్కయ్యపాలెం తాజ్ బాగ్ దర్గా లో హాజరత్ సయ్యద్ మహమ్మద్ బాబా తాజుద్దీన్ అవులియా (ర అ) వారి 73వ ఉర్సు మహోత్సవం

విశాఖపట్నం/జులై 5 : విశాఖపట్నం, అక్కయ్యపాలెం తాజ్ బాగ్ దర్గాలో హాజరత్ సయ్యద్ మహమ్మద్ బాబా తాజుద్దీన్ అవులియా (ర అ)వారి 73వ ఉర్సు మహోత్సవం ఈ నెల జులై 10వ తేది నుండి 14వ తేది వరకు వైభవంగా నిర్వాహస్త్తున్నట్టు దర్గా కమిటీ ఆదివారం ఒక ప్రకటన తెలిపింది. ఉర్సు కార్యక్రమం లో భాగంగా 11వ తేది శనివారం ఉదయం 8.30 గంటలకు నిషాని, 10.30 గంటలకు ఖురాన్ ఖాని, మీలాద్ షరీఫ్, ఫాతేహ, సాయంత్రం 7గంటలకు ఫాతేహ, సలాం, రాత్రి 8 గంటలకు తబురుఖ్ వితరణ, 12 వ తేది ఆదివారం ఉదయం 10.30 నుండి హాజరత్ తాజుద్దీన్ బాబా దర్గా నుండి విశాఖపట్నం కోటవీధి లో వున్న హాజరత్ ఇషాక్ మదని అవులియా దర్గా వరకు సందల్ ఊరేగింపు, అదే రోజు రాత్రి తాజుద్దీన్ బాబా దర్గా లో 7 గంటలకు ఫాతేహ, 13 వ తేది సోమవారం ఉదయం 10.30 గంటలకు ఖురాన్ ఖాని, మీలాద్ షరీఫ్, రాత్రి 7 గంటలకు ఫాతే హ, సలాం, తబురుఖ్, అదే రోజు రాత్రి 10గంటలకు ఫకిర్ల చె మహిఫీలె మీలాద్,14 వ తేది మంగళవారం ఉదయం 8.30 గంటలకు తాజుద్దీన్ అవులియా వారి జెండా ఆవిష్కరణ తో ఉర్సు ముగుస్తుందని అక్కయ్యపాలెం అస్తాన – ఎ – హాజరత్ బాబా తాజుద్దీన్ అవులియా దర్గా కమిటీ తెలిపింది.. హిందూ, ముస్లిం, సోదరులంతా ఈ ఉర్సు వేడుకల్లో పాల్గొనలసిందిగా కమిటీ విజ్ఞప్తి చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!