రాష్ట్రంవిశాఖపట్నం

మే డే వారోత్సవాలను జయప్రదం చేయండి, సిఐటియు

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఎనిమిది గంటల పని దినం సాధించిన మే డే సందర్భంగా వాడవాడల పతాకావిష్కరణలు చేయాలని అచ్యుతాపురం మండల కమిటీ కోరుతున్నది. నేడు అచ్చుతాపురం మండల కమిటీ సమావేశం కూండ్రపు. సోము నాయుడు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ .రాము మాట్లాడుతూ 140వ అంతర్జాతీయ మే డే సందర్భంగా శ్రామికులందరూ మే డే పతాకావిష్కరణలు లో పాల్గొనాలని 8 గంటల పని దినం సాధించిన మే డే స్ఫూర్తితో కార్మికులకు నష్టదాయకమైన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని యుద్ధం పేరుతో ప్రజలకు గ్యాస్, డీజిల్, పెట్రోల్ అందుబాటులో లేక నాన ఇబ్బందులు పడుతుంటే మోడీ ప్రభుత్వం కు ప్రజల బాధలు పట్టడం లేదని అధిక ధరలు నియంత్రించాలని కార్మికులు కనీస వేతనాలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు లాలం నరసింహారావు, రాజన్న రమేష్, చందా మంగమ్మ, ఆడారి నాగేశ్వరరావు, ఎన్. నారాయణరావు తదితరులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!