వార్డు డీలిమిటేషన్‌ను సంప్రదాయ పద్ధతిలో చేపట్టాలి- ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి: కె.కె. రాజు

విశాఖపట్నం: జీవీఎంసీ వార్డు డీలిమిటేషన్ ప్రక్రియలో ప్రజల సౌలభ్యం, పరిపాలనా అవసరాలు, స్థానిక సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకోకుండా అడ్డగోలుగా మార్పులు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కె.కె. రాజు ఆరోపించారు.వార్డు డీలిమిటేషన్ అంశంపై జీవీఎంసీ అదనపు కమిషనర్‌ను కలిసి పార్టీ సమన్వయకర్తలతో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నగరంలో ఎన్నికల నిర్వహణలో భాగంగా వార్డుల సంఖ్యను 120కి మార్చే ప్రక్రియ చేపట్టారని, దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా నిర్వహించారని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పరిపాలన సులభంగా జరిగేలా, అన్ని నిబంధనలు మరియు ప్రమాణాలను పాటిస్తూ డీలిమిటేషన్ చేయాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారని చెప్పారు. అయితే కోర్టులో డీలిమిటేషన్‌కు సంబంధించిన అంశాలు పెండింగ్‌లో ఉన్న సమయంలోనే జీవీఎంసీ అధికారులు అత్యుత్సాహంతో మ్యాపింగ్‌లో మార్పులు, చేర్పులు చేస్తున్నారని ఆయన విమర్శించారు.ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి , మోల్లి అప్పారావు, మాజీ డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్,పార్టీ కార్యాలయ ప్రర్య వేక్షులు రవిరెడ్డి, పార్టీ నాయకులు బాణాల శ్రీనివాసరావు,సాది పద్మారెడ్డి, రెయ్యి వెంకటరమణ, పేడాడ రమణ కుమారి , బిపిన్ కుమార్ జైన్, జీలకర్ర నాగేంద్ర, నీలి రవి, కర్రి రామిరెడ్డి, శ్రీదేవి వర్మ, సతీష్, చొల్లంగి నాగేశ్వరరావు, మువ్వల సంతోష్, సారి పిల్లి సంతోష్, సూర్య తదితరులు పాల్గొన్నారు.




