సీరత్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత ఖత్నా (సుంతి)వైద్య శిబిరం

విశాఖపట్నం /.. మే2(ట్రూ న్యూస్ ) : ఇస్లాం మతం ఆచార ప్రకారం ఉచిత (ఖత్నా)వైద్య శిబిరం కార్యక్రమం దొండపర్తి సింకా గ్రాండ్ లో సోమవారం సిరత్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. విశాఖపట్నం వివిధ మసీదు ప్రాంతాల్లో వున్న ముస్లిం ల వారి పిల్లలకు ఖత్నా (సుంతి) ప్రముఖ వైద్యులు డాక్టర్ మౌలాలి,డాక్టర్ మొయునుద్దీన్ అహమద్, డాక్టర్ అబ్దుల్ రెహమాన్ లు నిర్వహించారు. అనంతరం సీరత్ కమిటీ వారికి మందులు, సిరప్ లు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమం నకు ముఖ్య nఅతిధిగా విచ్చేసిన వై ఎస్ ఆర్ సీపీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఐ హెచ్ ఫరూకి మాట్లాడుతు పెద ముస్లిం బాలల కు ఉచితంగా ఖత్నా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అన్నారు.సిరత్ కమిటీ అధ్యక్షులు మునీర్ ఖాన్ బాబా,గౌరవ అధ్యక్షులు హైదరాలి సింకా మాట్లాడుతు పేద ముస్లిం పిల్లలకు ఉచితంగా (ఖత్నా)సుంతి వైద్యం ప్రతి ఏటా సుమారు 250 పిల్లలకు నిర్వహిస్తున్నమన్నారు. ఈ కార్యక్రమం లో భాగంగా ఈ రోజు సుమారు 150 మంది పిల్లలకు ఉచిత (ఖత్నా)చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం లో సిరత్ కమిటీ కార్యదర్శి ఎస్ కె జీలాని, అహమద్ అలి, ఖాజ,ఎస్ కే ఇస్మాయిల్,,ఎం డి రఫీ, షబ్బీర్,ఎం డి ఇషాక్, షకీల్ తదితరులు ఖత్నా వైద్య శిబిరానికి వైద్య సేవలు అందజేశారు. ముందుగా ఉచిత ఖత్నా (సుంతి)వైద్య శిబిరాన్ని ముందుగా రిజర్వ్ లైన్ మసీదు హాజరత్ మౌలానా బిలాల్ అల్లాహ్ నామస్మరణ తో ప్రారంభించారు.




