గాంధీజీ తమకు ఆదర్శం ఇరాన్ సుప్రీం లీడర్ సయ్యద్ అలీ ఖామెనాయి వారి సంస్మరణ సంతాప సభలో ఇరాన్ సుప్రీం లీడర్ దౌత్యవేత్త ఆయతుల్లా డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ

విశాఖ ఉత్తర నియోజక వర్గం అక్కయ్యపాలెం వద్దనున్న ముస్లిం ల ఇదారా ఏ ఇమామ్ రేజా భవనం లో షియా ముస్లిం ఇదారా ఏ ఈమామ్ రేజా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇరాన్ సుప్రీం లీడర్ సయ్యద్ అలీ ఖామెనాయి వారి సంస్మరణ సంతాప సభలో ఇరాన్ సుప్రీం లీడర్ దౌత్యవేత్త ఆయతుల్లా డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ పాల్గొన్నారు. భారత దేశంలో అన్న్య మతాల వారు శాంతి తో కుల మతాలకు అతీతంగా కలిసి మెలసి వుంటారని ఇరాన్ సుప్రీం లీడర్ దౌత్యవేత్త ఆయతుల్లా డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ అన్నారు. శాంతికి ప్రతిగా మహాత్మా గాంధీజీ తమకు ఆదర్శమని ఇరాన్ లో అత్యంత కీలకమైన ప్రాంతానికి మహాత్మా గాంధీ జీ పేరును పెట్టమని, అలాగే ఇరాన్ లో ప్రముఖ ఆస్పత్రి, కళాశాల లకి సైతం మహాత్మా గాంధీ జీ పేరును పెట్టడం జరిగిందని ఇండియా, ఇరాన్ కి స్వాతంత్ర్యం నాటినుండి నేటి వరకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. 30 జనవరి మహాత్మా గాంధీ జీ సంస్కరణ దినోత్సవాన్ని ప్రతి ఏడాది మహాత్మా గాంధీ జీ పేరున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇరాన్ ఒక పేద, ధనిక దేశమని ఇరాన్ సుప్రీం లీడర్ సయ్యద్ అలీ ఖామెనాయి ఒక సాధారణ వ్యక్తి అని అతడికి నలుగురు కుమారులు ఉన్నారని నేటికి సొంత ఆస్తులు లేకుండా ఒక సాధారణ అద్దె భవనంలో ఉంటున్నారని అన్నారు.. యుద్ధం సమయంలో సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సైన్యం సూచించిన తాను దేశ ప్రజలకు రక్షణగా ఉంటానని ఎదురు నిలబడి పోరాటం చేశారన్నారు.. ఇండియా,ఇరాన్ మధ్య 5వేల సంవత్సరాల సంబంధమని రాజకీయాలకు అతీతంగా రెండు దేశాల సంబంధం కొనసాగుతూ వస్తుందన్నారు.. ఇండియా,ఇరాన్ మధ్య విద్య, ఉపాధి, వ్యాపారం పరంగా రెండు దేశాలు కలిసి కట్టుగా ముందుకు వెళ్తున్నాయని, ఇండియాలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు ఇలా అనేక మతాలు కలిసి సమైక్యంగా జీవించడం ఒక అద్భుతమన్నారు..ఇరాన్ దేశంలో ప్రజలను అతి కిరాతంగా శత్రు దేశం పొట్టన పెట్టుకుందని కన్నీటి పర్యంతమయ్యారు.. ఇరాన్ యుద్ధంలో అమరులైన ప్రతి ఒక్కరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు..




