విశాఖపట్నం

నాడీ సంబంధిత వ్యాధుల’పై అవగాహన సదస్సులో విశాఖ నగర సీపీ డా. శంఖ బ్రత బాగ్చి

మురళీనగర్, ఏప్రిల్ 19: మాస్టర్ఇ కె జనకులం ఫౌండేషన్, వైశాఖీ స్పోర్ట్స్ పార్క్, సిప్లా సౌజన్యంతో “వాకర్స్ హెల్త్ క్లబ్”, అధ్యక్షులు సి హెచ్. శ్రీనివాస రాజు, యూనివర్సల్ యూత్ వాకర్స్ అధ్యక్షులు వంశీ చింతలపాటి మురళీనగర్ వైశాఖీ స్పోర్ట్స్ పార్క్ ప్రాంగణంలో ఆదివారం నాడీ సంబంధిత వ్యాధులపై “అవగాహనా సదస్సు” ఘనంగా నిర్వహించారు.

ఈ సదస్సులో ముఖ్య అతిధిగా నగర పోలీస్ కమీషనర్ డా.శంఖ బ్రత బాగ్చి పాల్గొని మాట్లాడుతూ పార్కిన్సన్స్ వ్యాధి ప్రాణాంతక మైనదని, తొలిదశలోనే గుర్తించి,
తగిన చికిత్స పొందాలనన్నారు.
ఆధునిక జీవన సరళీ విధానంలో మానసిక, ఒత్తిడులతో రక్తపోటు, మధుమేహం వంటి అనేక సమస్యలతో పాటుగా నాడీ సంబంధిత వ్యాదులైన (న్యూరో ప్రాబ్లెమ్స్ ) బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్, హార్ట్ ఎటాక్స్ కార్దియాక్ అరెస్ట్ లతో మృత్యువాత పాలవడమే గాకుండా మతిమరపులాంటి అనేక సమస్యలను నేటి మానవజాతి ఎదుర్కొంటుందని, నరాల బలహీనతలకు సంబంధిత అనేక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి, తగిన చికిత్సతో మనమెలా బయట పడాలో సవివరంగా వివరించి సభికులను ఆశ్చర్యపరిచారు.

“భౌతిక మానసిక వ్యాయామాలే నాడీ వ్యవస్థకు దివ్య ఔషదాలు!”

విశిష్ఠ అతిధిగా పాల్గొన్న ప్రముఖ న్యూరోలాజిస్ట్ డా. కె .వెంకటేశ్వర్లు
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తూ నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచెయ్యడానికి, మానసిక ఒత్తిడిని జయించడానికి నిత్య వ్యాయామంగా నడకని మలచుకోవాలని, యోగ ధ్యానాదులను అభ్యసించడం ద్వారా నాడీ సంబంధిత వ్యాధులకు ఇవి దివ్యైషదాలుగా ఉపకరిస్తాయని, అరవై ఏళ్ల వయసు పైబడిన కొందరిలో మాత్రమే నాడీ కణాలు మెదడను దెబ్బతీయడం జరుగుతుందని, ‘న్యూరోట్రాన్స్మిటర్’ డోపామైన్ తగ్గి పోవడం వలన వణుకుడు వ్యాధివస్తుందని,చేతులు,కాళ్ళు,దవడలలో వణుకు రావడం, కండరాల బిగదీయడం. పట్టేయడం, చేపట్టిన పనివేగంలో తగ్గుదల,స్నానం,తినడం వంటి అతి సాధారణ కార్యకలాపాలను కూడా ఆలస్యం చేస్తారని , నిరాశ నిస్పృహలు, భయము, వ్యక్తియొక్క మాటల్ని,
చేతివ్రాతను కూడా దెబ్బతీయడం ఈ వ్యాధి యొక్క ప్రాధమిక లక్షణాలన్నారు. వైద్యులు సూచించిన మందులను వాడితే బాదితులు మామూలు జీవితాన్ని పొందవచ్చన్నారు. శ్రోతలు ఆడిగిన అనేక సందేహాలకు ఆయన నివృత్తి చేశారు.

ఈ సదస్సులో గౌరవ అతిధిగా పాల్గొన్న వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 101 గవర్నర్ ఆర్ఆర్ఎస్ మహేష్ వాకర్స్ క్లబ్స్ లక్ష్యం, ధ్యేయం “ఆరోగ్యమే మహాభాగ్యమని”, ‘నడవండి – నడిపించండి’ తమ నినాదమని అన్నారు. గౌరవ అధ్యక్షునిగా పాల్గొన్న వైశాఖీ స్పోర్ట్స్ పార్క్ అధ్యక్షలు సనపల వరప్రసాద్ మాట్లాడుతూ శ్రీనివాస రాజు కుటుంబమంతా అందిస్తున్న నిస్వార్ధ సేవలు అభినందనీయమని, తండ్రి బాటలో నడుస్తూ అనేక సామాజిక, ఆరోగ్య,సేవా చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్న వంశీ చింతలపాటి ఈనాటి యుతరానికి యూత్ ఐకాన్ ఎడుగుతున్నారన్నారు. క్లబ్’ అధ్యక్షులు సి హెచ్. శ్రీనివాసరాజు మాట్లాడుతూ సకాలంలో స్పందించి, ఆపదలో ఉన్నవారిని ఆదకొనే స్వభావాన్ని ప్రతి ఒక్కరూ మానవత్వంగా మలచు కోవాలని,వాకర్స్ క్లబ్స్ నిర్వహిస్తున్న అనేక ఉచిత వైద్య ,ఆరోగ్య అవగాహనా శిబిరాలలో ఎంతోమంది లబ్ది పొందుతున్నారని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు
ఈ సభలో వైశాఖీ స్పోర్ట్స్ పార్క్ కార్యదర్శి పి ఎస్ ఎన్ రాజు, కోశాధికారి మళ్ళ రామకృష్ణ, నాగరానికి చెందిన పలు వాకర్స్ క్లబ్స్, అనేక స్వచ్ఛంద,సామాజిక సేవా సంస్థల అధ్యక్షులు, ప్రతినిధులు రెండు వందలకు పైగా పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!