వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్తలు మరియు పరిశీలకులు సమావేశం

విశాఖపట్నం ఏప్రిల్ 21 : మద్దిలపాలెం, కృష్ణ కాలేజ్ రోడ్డు లో గల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిలా పార్టీ అధ్యక్షులు కె.కె రాజు అధ్యక్షతన విశాఖపట్నం జిల్లా పరిధిలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు మరియు పరిశీలకులతో సమావేశం నిర్వహించబడింది.ఈసమావేశంలో పార్టీ బలోపేతం, వ్యవస్థీకరణ మరియు డిజిటల్ పరిపాలనపై కీలక చర్చ జరిగింది. పార్టీ కమిటీల ఏర్పాటు (డిజిటల్ ప్రాతిపదికన) రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, వార్డు మరియు సచివాలయం స్థాయిలలో పార్టీ కమిటీలను సమగ్రంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి కమిటీ సభ్యుల వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేసి, సమగ్ర డేటాబేస్‌ను రూపొందించడంతో పాటు దాని నిర్వహణపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వబండాయి. మరియు కమిటీల వివరాల సమర్పణ, ఏర్పాటు చేసిన కమిటీల వివరాలను నిర్ణీత కాలవ్యవధిలో జిల్లా పార్టీ కార్యాలయానికి సమర్పించాలని సూచించారు.ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో నియోజకవర్గం సమన్వయకర్తలు మళ్ళ విజయప్రసాద్ ,తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి ,మొల్లి అప్పారావు ,రాష్ట్ర పార్టీ కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి ,నియోజకవర్గ పరిశీలకులు పసుపులేటి బాల రాజు ,తైనాల విజయకుమార్ ,సిఎంఎ జహీర్ అహ్మద్ , చింతకాయల సన్యాసిపాత్రుడు ,పేడాడ రమణి కుమారి పాల్గొన్నారు.




