నేరంవిశాఖపట్నం
ప్రేమ మోసం. ప్రాణం తీసుకుంది! విశాఖలో యువతి ఆత్మహత్య!

ఏప్రిల్ 26 విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.ఎండాడ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఇటీవల ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైనట్లు సమాచారం.ఎండాడ రాజీవ్ నగర్‌లో నివాసం ఉంటున్న భాస్కర్‌రావు కుమార్తె సంధ్య ప్రేమ విఫలమవడంతో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది.ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.




