విశాఖపట్నం

కైలాసగిరి పర్యాటక ప్రాంతంలో అదనపు వసూళ్లు సరికాదు – కె.కె రాజు

కైలాసగిరి పర్యాటక ప్రాంతంలో ఇటీవల అమలు చేస్తున్న కొత్త టికెట్ విధానం, పార్కింగ్ ఛార్జీలు మరియు వివిధ రకాల అదనపు వసూళ్లు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని . ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా, కనీస సమాచారం ఇవ్వకుండానే ఈ విధానాన్ని అమలు చేయడం తీవ్రంగా ఖండనీయము అని. ఇప్పటివరకు వాహనాలకు మాత్రమే టోల్ రుసుం వసూలు చేయగా, తాజాగా వాహనంలో ప్రయాణించే ప్రతి వ్యక్తిపై అదనంగా రూ.10 చొప్పున వసూలు చేయడం అన్యాయంగా ఉందని విశాఖ వైయస్సార్సీపి జిల్లా అధ్యక్షుడు కె.కె రాజు ఫైర్ అయ్యారు.  ఈ నిర్ణయం కారణంగా కుటుంబాలతో, స్నేహితులతో కలిసి వచ్చే పర్యాటకులు అనవసర ఆర్థిక భారం భరించాల్సి వస్తోంది. ప్రజలకు విశ్రాంతి, వినోదం కలిగించే ప్రదేశంగా ఉండాల్సిన కైలాసగిరిని ఆదాయ వనరుగా మార్చి సాధారణ ప్రజలపై భారాలు మోపడం సరైన విధానం కాదని . ఇలాంటి చర్యలు పర్యాటక అభివృద్ధికి ప్రతికూలంగా మారడమే కాకుండా ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయని. అందువల్ల వెంటనే ఈ పెరిగిన టికెట్ విధానాన్ని రద్దు చేసి, పాత విధానాన్ని పునరుద్ధరించాలని కె.కె రాజు సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. లేకపోతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!