మతంవిశాఖపట్నం
ఆన్సర్ మదని ఔలియా వారి ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు జరిపిన హ్యూమన్ రైట్స్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు, ఇట్స్ ట్రూ న్యూస్ డిజిటల్ మీడియా చైర్మన్ షేక్.బాషా

అనకాపల్లి జిల్లా బయ్యవరం లో శనివారం నాడు హజరత్ అన్సర్ మదని ఔలియా వారి ఉర్సు మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఉర్సు వేడుకలలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు ఇట్స్ ట్రూ న్యూస్ డిజిటల్ మీడియా చైర్మన్ షేక్.బాషా పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు జరిపారు. ఈ కార్యక్రమంలో కరీముల్లా ట్రావెల్స్ చైర్మన్ మొహమ్మద్ జిలాని, అర్బన్ ఏసీ టెక్నీషియన్ షేక్. అయ్యుబ్, కేజియన్ ఇంటీరియర్స్ ప్రొప్రైటర్ షేక్. ఆషిక్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆన్సర్ మదని ఔలియా దర్గాకు ప్రాచీన చరిత్ర ఉంది. ఎంతో మహిమగల బాబా వారిని దర్శించుటకు ఉర్సు వేడుకలలో వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. కమిటీ సభ్యులు అత్యంత వైభవంగా ఉర్సు ఉత్సవాలను నిర్వహించారు. వచ్చిన భక్తులందరికీ ప్రసాద వితరణ కార్యక్రమ ఏర్పాట్లను దర్గా కమిటీ సభ్యులు చాలా చక్కగా నిర్వహించారు.




