రాష్ట్రం
రేపటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు జూన్ 12న పునఃప్రారంభం

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వేసవిసెలవులను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈనెల 24 నుంచి అమలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 12న పునఃప్రారంభించాలని స్పష్టం చేసింది. విద్యా సంవత్సర కేలండర్ ప్రకారం ఈ సెలవులను ప్రకటించింది. విద్యా సంవత్సరం చివరి రోజులోగా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు భద్రతా చర్యలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించింది. మధ్యాహ్నం 12 గంటలు నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో బయట తిరగకూడదని విద్యార్థులకు వివరించాలని తెలిపింది. పాఠశాల నోటీసు బోర్డులపై భద్రతా నియమాలను ప్రదర్శించాలని, తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తూ పిల్లలపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలని ఆదేశించింది.




