నేరంవిశాఖపట్నం

వైజాగ్ చేపల రేవు ప్రాంతం లొ వ్యక్తి దారుణ హత్య తలపై గాయం.. మెడకు తాడు బిగించి హత్య చేసిన దుండగులు   

విశాఖపట్నం/సెప్టెంబర్ 7 : విశాఖపట్నం లొ దారుణ హత్య కలకలం రేపింది. విజయనగరం జిల్లా బోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన మైలపల్లి చంటి అనే వ్యక్తి ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గత కొంతకాలంగా, చంటి తన భార్య పిల్లల తో కలిసి విశాఖ లోనే నివాసం వుంటున్నారు. విశాఖ లొ ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా చేపల వేట కొనసాగిస్తూ, జీవనం కొనసాగిస్తున్నాడు.ఈ క్రమంలో ఫిషింగ్ హార్బర్ సమీపంలో బీచ్ ప్రాంతంలో సోమవారం అతడు సవమై కనిపించడం తో స్థానికులు తీవ్ర ద్రిగ్బoతి కి గురయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితి ని సమీక్సించి విచారణ చేపట్టారు.చంటి తలపై దుండంగులు కర్రతో బలంగా బాది ఆ తర్వాత,మెడ చుట్టూ నైలాన్ తాడు బిగించి ఉరివేసి చంపేసినట్లు

గుర్తించారు. హత్యకు ఉపయోగించిన తీరును బట్టి పక్కా పథకం ప్రకా రమే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తర లించారు. ఈ దారుణంపై పోలీసులకు మృతుడి సోదరి అప్పలకొండ ఫిర్యాదు చేశారు. ఆదివారం నుంచి కొందరు వ్యక్తులు తనను చంపేస్తా మని బెదిరిస్తున్నట్లు చంటి తనతో చెప్పాడని ఆమె తెలిపారు. బాధితు రాలి ఫిర్యాదు మేరకు విశాఖ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ వేగవంతం చేశారు. పాత కక్షలా లేక ఆర్థిక లావా దేవీలా అనే కోణాల్లో ఆరా తీస్తున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!