వార్డు కార్పొరేటర్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలి మాజీ మంత్రి గుడివాడ అమర్నాద్ కూటమి ప్రభుత్వంలో చాలామందికి ఉద్యోగాలు రావడం లేదు – ఎస్ ఇ సి సభ్యులు ఐ హెచ్ ఫారుఖి

విశాఖపట్నం/సెప్టెంబర్ 20 వార్డు కార్పొరేటర్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాద్ పిలుపు నిచ్చారు. పెందుర్తి నియోజకవర్గం 77 వార్డు నమ్మి దొడ్డి జంక్షన్ లో ఆదివారం 77 వ వార్డు వై ఎస్ ఆర్ సీపి విస్తృతస్థాయి సమావేశం 77వ వార్డు వై ఎస్ ఆర్ సీపి అధ్యక్షుడు మద్ది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్ నాధ్ మాట్లాడుతు వార్డు నాయకులు, కార్యకర్తలు చేసే ప్రతి ఉద్యమంలో ఆదినాయకత్వం మీకు తోడుగా ఉంటుందని తాను భరోసా ఇస్తున్నానని అన్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రభుత్వ పని తీరును ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో ప్రజలే తమ తీర్పు ను ఇస్తారని అన్నారు. ప్రజలకు చేసిన మంచి పనులు, కార్యకర్తలు ఐక్యత ప్రజలతో వున్న అనుబంధమే వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కి నిజమైన బలమని అన్నారు. మాజీ శాసన సభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు మాట్లాడుతు ఈ సమావేశం నుండి స్థానిక సంస్థలు ఎన్నికలకు విజయ శంఖం పురిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్క నాయకుడు పార్టీ అభివృద్ధి గెలుపే లక్ష్యంగా పని చేసి విజయ బావుట ఎగురవేయాలని అన్నారు.
రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఐ హెచ్ ఫరూఖి మాట్లాడుతు ముందుగా సభకు విచ్చేసిన అందరికి ప్రత్యేక నమస్కారములు, సలాములు తెలియజేస్తు, ఇంత మంది ఈ సభకు విచ్చేశారు అంటే మద్ది శ్రీనివాసరావు కి ఎంత ప్రజా బలం ఉందొ తెలుస్తోందన్నారు . చాలా మంది నిరుద్యోగులు నా ద్రుష్టి కి తెలియజేసింది, ఈ కూటమి ప్రభుత్వం లో చాలా మందికి ఉద్యోగాలు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రానున్న ప్రభుత్వం లో మాజీ మంత్రి గుడివాడ అమర్ నాద్ ఈ విషయంమైచొరవ తీసుకోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అందరికి సంతోషంగా ఉంటుందని అన్నారు. అనంతరం ముఖ్య అతిధులు, సభకు విచ్చేసిన వారు,ముస్లిం మైనారిటీ సోదరులు ఐ హెచ్ ఫరూకి ని శాలువా తో సత్కరించి మెమెంటో బహుకరించారు. కార్యక్రమంనకు ముందుగా స్వర్గీయ డా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి జ్యోతి ని ప్రజల్వన చేసి సభా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో మాజీ శాసన సభ్యులు తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకట రామయ్య, గాజువాక నియోజకవర్గం వైసీపీ సమనవ్యయకర్త తిప్పల దేవన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు, పైలా శ్రీనివాసరావు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు బి హేమంత్ కుమార్,
ఎంపీ రెడ్డి, బట్టు పైడిరెడ్డి, బట్టు సతీష్ రెడ్డి, పిట్ట చిట్టిబాబు, సావడ అప్పల రెడ్డి, వాక అప్పలరెడ్డి, మద్ది సింహాచలం, పలికిల నాయుడు, మద్ది అప్పలనాయుడు, మద్ది అప్పారావు, మద్ది కనక, దాసరి తాతారావు, దాసరి అప్పాలరెడ్డి, దాసరి నగేష్, మనోహర్, పార్వతీ రావు, కర్రి అప్పారావు, కర్రి రెడ్డి, మద్ది నూకరాజు, ఎం డి అన్వర్,దావుద్, ముస్తఫా, నాసిర్, గాఫుర్, రంజాన్ అలీ, హైదర్ వలి, నల్ల రాజేష్, సురేష్,సుధాకర్,రాజేష్,నన్న,మదీనా, అదిల్ , సోనూ, పలికల త్రినాధ్, మారదా సోములు, మారాడా అప్పిరెడ్డి, వేంపాడ అప్పలరెడ్డి, వేంపాడ శ్రీను, ఆన్సర్ వలి, రషీద్, మదీనా,ఎం ఎ వల్లి, అక్కు నాయుడు, రాజు, ,నాయకులు, కార్యకర్తలు,స్థానిక యువత ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




