రాజకీయాలువిశాఖపట్నం

దగా డి ఎస్సి అక్రమాలపై సిబిఐ తో విచారణ జరిపించాలి వైసీపీ శ్రేణులు ముట్టడి తో జిల్లా కలక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం

విశాఖపట్నం/జూన్ 1 : కూటమి ప్రభుత్వం నిర్వహించిన దగా డి ఎస్సి అక్రమాలపై సిబిఐ తో విచారణ జరిపించి, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను భర్తరఫ్ చేయాలని రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. మాజి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు,జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఊరుకుటి చందు ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పరిషత్ కూడలి నుండి జిల్లా కలక్టర్ కార్యాలయం వరకు మెగా డి ఎస్పీ కాదు, దగా డి ఎస్పీ, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి,సి ఎం డౌన్, డౌన్

అంటూ ప్ల కార్డులతో ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. వారిని కలెక్టర్ కార్యాలయంలోకి అనుమతించకపోవడంతో కొద్ది సేపు పోలీసులు, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట వాద్వివాదం జరగడంతో రోడ్డుపైన బైకాయించి ధర్నా చేశారు. అనంతరం వైసీపీ నేతలను పోలీసులు అనుమతించడంతో జిల్లా కలెక్టర్ పీజీఆర్ఎస్లో వినతి పత్రం అందజేశారు. శాంతి యూత నిరసన ర్యాలీ లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి విశాఖపట్నం వైసీపీ జిల్లా అధ్యక్షులు కె కె రాజు ఆధ్వర్యంలో కుడా నియోజకవర్గం నుండి పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ గా వెళ్లి పాల్గొన్నారు. ఈ సందర్బంగా  వైసీపీ జిల్లా అధ్యక్షులు కే.కే.రాజు మీడియా తో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 40. లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఉద్యోగ అవకాశాల కల్పన చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. కూటమి ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన నేటికీ కూడా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలపై గానీ, భృతిపై కనీస స్పందన లేదని విమర్శించారు. డీఎన్సి ప్రక్రియలో మెరిట్ లిస్టును పూర్తిగా పక్కన పెట్టి డీఎస్సీ ఉద్యోగాలను లక్షల రూపాయలకు అమ్ముకున్నారని ఆరోపించారు. లోకేష్ ఆధ్వర్యంలో డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ అవినీతి జరిగిందని, తండ్రీ కొడుకులకు చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీ ప్రక్రియపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో 1లక్ష 30వేల ఉద్యోగాలు నిష్పక్షపాతంగా యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి లక్ష యాభై వేల సచివాలయ ఉద్యోగాలు నిష్పక్షపాతంగా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేశారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్, ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల భర్తరఫ్ చేశారన్నారు. కూటమికి అనుకూలంగా డీఎస్సీ నోటిఫికేషన్ మార్చుకొని సెలెక్ట్ అయిన వారి డేటా డిలీట్ చేశారన్నారు. వైసీపీ పార్టీ పోలీసులకు భయపడదని ఇంకో మూడేళు మాత్రమే కూటమి ఉంటుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో సీఎం అవుతారని జోష్యం చెప్పారు. వైసీపీ ప్రజలకు అండగా ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం వై ఎస్ ఆర్ సీపీ పరిశీలకులు వీసం రామకృష్ణ,రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అంబటి శైలేష్, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కుంభ రవిబాబు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి, మాజీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్,రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్,దేవరకొండ మార్కండేయులు,విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ద్రోణంరాజు శ్రీవాత్సవ్, డాక్టర్ జహీర్ అహమ్మద్, షరీఫ్,మాజీ కార్పొరెటర్లు బర్కత్ అలి, అనిల్ కుమార్ రాజు, మహమ్మద్ ఇమ్రాన్,మువ్వల పోలరావు రేయ్యి వెంకట రమణ, సేనాపతి అప్పారావు, పైడి రమణ, ఎం డి హబీబ్, బాణాల తరుణ్ కుమార్,బలిరెడ్డి గోవింద్, ముజీబ్ ఖాన్,41వ వార్డు వైసీపీ అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!