ఆంధ్ర యూనివర్సిటీ స్టాఫ్ కోఅపరేటివ్ సొసైటీ నూతన కార్యవర్గం ఎన్నిక

ఆంధ్ర యూనివర్సిటీ స్టాఫ్ కోఅపరేటివ్ సొసైటీ నూతన కార్యవర్గం ఎన్నుకోబడింది అధ్యక్షులుగా దువ్వి గోవింద్ , ఉపాధ్యక్షులుగా ఖాదర్ బాబా , సెక్రటరీగా నక్కాన గిరి , జాయింట్ సెక్రటరీగా లక్ష్మణ బాబు , కోశాధికారిగా ఆచార్య సిద్దయ్య ఎన్నుకోబడ్డారు.
సుమారుగా 1100 మంది సభ్యులుగా ఉన్న ఈ ఆంధ్ర యూనివర్సిటీ స్టాఫ్ కోఆపరేటివ్ సొసైటీ 110 కోట్ల టర్న్ అవర్ కలిగి ఉంది.
ఈ కార్యవర్గం ముఖ్యంగా సొసైటీ కంప్యూటరి కరణ, సభ్యులకు లోన్లపై ఇన్సూరెన్స్, టైం స్కేల్ ఉద్యోగుల 28 డేస్ ఉద్యోగుల రుణాలు మరియు వాటి నిర్వహణ పై దృష్టి సారించి సభ్యులందరికీ మేలు కరిగే విధంగా పనిచేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆచార్య సుధాకర్, ఆచార్య పల్లవి,ఆచార్య యుగంధర్,డాక్టర్ జి రవికుమార్, కొయ్య సోమేస్, కిలాన కిరణ్, డొక్కర శ్రీనివాసరావు, మేనేజర్ గొలగాని అశోక్, మంగరాజు, రాధాకృష్ణ, అగర్వాల్ దాస్ తదితరులు పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలియచేసారు.




