హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో స్ప్లిట్టింగ్ఆప్షన్ లేకపోవడం వలన అర్హులై ఉండి ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు ప్రభుత్వం ఈ స్ప్లిట్టింగ్ అప్షన్ ను పెట్టాలి – షేక్. బాషా

హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో విభజన (స్ప్లిట్టింగ్) లేకపోవడం వలన అర్హులై ఉండి కూడా పథకాలకు దూరం అవుతున్నారు ఒక ఇంటిలో ఇద్దరు అన్నదమ్ములు ఒకే ఆ మ్యాపింగ్ లో ఉండడం వల్ల ఒక అన్న బాగా సంపాదపరుడై ఉండి రెండవ తమ్ముడు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటే ఇలాంటి సందర్భంలో ఆ రెండవ అర్హుడైన తమ్ముడకు ప్రభుత్వ పథకాలు ఏమీ అందడం లేదు. వృద్దులు వితంతువులు, అంగవైకల్యం, కలవారు పెన్షన్లకు స్ప్లెటింగ్ ఆప్షన్ లేకపోవడం వలన పెన్షన్లకు ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారు. అలాగే చాలామంది అర్హులై ఉండి ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. దయచేసి సంబంధిత అధికారులు దీనిపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించి ఈ స్ప్లిట్టింగ్ అప్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి – షేక్ బాషా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు, విశాఖ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం నాయకులు




