నిరసన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టిన విశాఖ జిల్లా అధ్యక్షుడు కె. కె రాజును ఆర్ అండ్ బి జంక్షన్ వద్ద అరెస్టు చేసిన పోలీసులు

- డీఎస్సీ అక్రమాలపై శాంతియుత నిరసన ర్యాలీకి పిలుపు ఇచ్చిన కె. కె రాజు
- ర్యాలీ కి అనుమతి లేదు అని విద్యార్థి, యువత, నాయకులను ఎక్కడికి అక్కడ నిర్బంధించిన పోలీసులు
- విద్యార్థులు, యువత, నాయకులతో కలిసి ర్యాలీకి సిద్ధమైన కె. కె. రాజు
- కె.కె రాజును , విద్యార్థులు, యువకులు, నాయకులను,కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
విశాఖ ఉత్తర నియోజకవర్గం వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కె. కె రాజు అధ్యక్షతన R&B జంక్షన్ నుంచి సీతమ్మధార ఎమ్మార్వో ఆఫీస్ వరకు భారీ నిరసన ర్యాలీనీ నిర్వహించడానికి సిద్దమయ్యారు కె. కె రాజు పిలుపుమేరకు R&B జంక్షన్ వద్దకు చేరుకుంటున్న యువత, విద్యార్థులును, నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికి అక్కడ నిలుపు వేశారు..
పోలీసుల తిరును నిరసిస్తూ R&B జంక్షన్ వద్దకు చేరుకున్న కె. కె. రాజును , యువకులు, విద్యార్థులు, నాయకులను బలవంతంగా ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్లి పోలీసులు అరెస్టులు చేశారు..
పోలీసులు అరెస్టులు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు..
స్టేషన్ బెయిలు మంజూరు చేసిన పోలీసులు
శాంతియుత నిరసన చేస్తున్న కె. కె రాజును యువత, విద్యార్థులు, నాయకులను అరస్ట్ చేసి నేరుగా స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు అనంతరం కొన్ని షరతులతో కూడిన స్టేషన్ బెయిల్ ఇచ్చి కె కె రాజుతో సహా మిగతా వారిని కూడా విడుదల చేశారు…
దివంగత మహానేత వైస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించిన కె కె రాజు
స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ నుండి విద్యార్థులు, యువత,నాయకులుతో కలిసి నేరుగా సీతమ్మధార ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా ఉన్న దివంగత మహానేత వై. ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహనికి నాయకులు కార్యకర్తలుతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు
ఈ సందర్భంగా కె. కె రాజు మాట్లాడుతూ
నిరుద్యోగులకు యువతీ యువకులకు ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని గత కొన్ని రోజులుగా శాంతియుత నిరసన దీక్షలు చేపట్టడం జరిగిందని ఈ శాంతియుత నిరసన దీక్షలో విద్యార్థుల నుండి యువతీ యువకులు నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తే ఈ కూటమి ప్రభుత్వం పోలీసులు అడ్డుపెట్టి,ఆంక్షలు విధించి అడ్డుకుంటుందని మండిపడ్డారు..
విద్యార్థుల తరఫున యువతీ యువకుల తరఫున ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కార్యక్రమం చేస్తున్న విద్యార్థులు, యువకులు, మా నాయకులు కార్యకర్తలపై పోలీసులు దాడులు దురదృష్టకరమని అన్నారు.
మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని మేము శాంతియుతంగా నిరసన చేస్తే మమ్మల్ని దుర్మార్గంగా అరెస్టు చేస్తారా..
ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి ప్రభుత్వ రాక్షస రాజ్యంలో సాక్షిగా అరాచకం సృష్టిస్తున్నారు అని తీవ్ర స్థాయి లో మండిపడ్డారు .
ఈరోజు పోలీసులను అడ్డుపెట్టుకొని మీరు చేస్తున్న గుండాయిజం,రౌడీయిజం ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పే రోజులు వస్తున్నాయనిఅన్నారు .
మీ బెదిరింపులకు మీ తాటాకు చప్పుళ్ళకు మా వైసీపీ కార్యకర్తలు ఎవరు భయపడేదే లేదని మీరు ఎంతగా అనగదొక్కతే అంతకుమించి మా పోరాటం ఉంటుందని హెచ్చరించారు…
పోలీసులు ఎంత భయపించిన భయపడకుండా పోరాటం చేసిన యువకులకు, విద్యార్థులకు,నాయకులకు, కార్యకర్తలకు అభిమానులకు నాహృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్న మన్నారు.
ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు, విద్యార్థులు,మేధావులు మరియు మాజీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, నియోజకవర్గ పరిశీలకులు ,పెడాడ రమణి కుమారి,ప్రచార విభాగం జోన్ -1 ప్రెసిడెంట్ రవిరాజు,మాజీ కార్పొరేటర్లు అల్లు శంకర్ రావు, అనిల్ కుమార్ రాజు, పద్మరెడ్డి,వావిల్లపల్లి ప్రసాద్, రేయ్యి వెంకటరమణ, భర్కట్ ఆలీ, సేనాపతి అప్పారావు, పామెటీ బాబ్జి,దళ్లి రామకృష్ణ రెడ్డి,వార్డు అధ్యక్షులు గుజ్జు వెంకటరెడ్డి,పైడి రమణ,బల్ల శ్రీను, అశోక్ రెడ్డి, బొడేటి కిరణ్,బి శెట్టి ప్రసాద్, జకంపూడి సత్యనారాయణ, హబీబ్, సుకుమార్, డోప్ప శ్రీను, ఐ రవికుమార్, వేణు, ధమావంతి, చిరంజీవి, ఎరం శెట్టి శ్రీను, రాష్ట్ర, జోనల్, జిల్లా, నియోజకవర్గ నాయకులు కిరణ్ రాజు,తాడి జగన్నాధరెడ్డి,దివ్య కళ, దుప్పలపూడి శ్రీనివాస్ అంబటి శైలేష్ యం.సునీల్, భోగవల్లి గోవింద్, తిరుమలరావు,పద్మ శేఖర్,కె వి బాబా, నీలిరవి, మెరువ గణేష్, కరి రామారెడ్డి, పి.ఈశ్వరి, దేవివిశాలాక్షి, రాయుడుశ్రీను, గుజ్జుధీరజ్ కుమార్, సబ్బవరపు శ్రీను,నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు, మువ్వల సంతోష్, పి. హరి,నితీష్, పి.సునీత,షేక్ బాబ్జి,సతీష్, లక్ష్మణరావు బాధ శ్రీను, భద్రి,తాటిపూడి రత్నం,కె. సూర్య,అనిల్ శర్మ,వార్డు పరిశీలకులు,వార్డు అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు,వార్డు వైస్ ప్రెసిడెంట్,మహిళలు, సచివాలయం అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు,మహిళలు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




