మతంవిశాఖపట్నం

ముస్లిం యంగ్ మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఖత్నా (సుంతి)వైద్య శిబిరం

విశాఖపట్నం మె 17(ట్రూ న్యూస్ ) :ప్రవక్త ఇబ్రహీం అలైహి వ సల్లం సున్నత్ అనుసరించి విశాఖపట్నం వన్ టౌన్ లో ఉన్న డాక్టర్ దీన్ షాది ఖానా లో ముస్లిం యంగ్ మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత ఖతన ( సున్తి) కార్యక్రమం న్ని డాక్టర్ మౌలాలి నేత్రుత్వం లో సుమారు 300 మందికి ఖత్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం నుండి పెద్ద ఎత్తున ముస్లిం ప్రజలు హాజరై వాళ్ళ పిల్లలకి సున్తీ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు చౌడే వెంకట పట్టాభిరామ్ మరియు విశాఖ సౌత్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ సీతారం సుధాకర్, 35 వ వార్డు మాజీ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు , ఐ హెచ్ ఫరూకి , డాక్టర్ జహీర్ అహ్మద్, మహమ్మద్ మఖ్బూల్, ఎస్ ఎ రెహమాన్, కైలాసపురం మాజీద్ రజ అధ్యక్షులు, సీరత్ కమిటీ అధ్యక్షులు ఎం డి మునీర్ ఖాన్ బాబా,,టీడీపీ పార్లమెంట్ పార్టీ వైస్ ప్రెసిడెంట్, స్టేట్ మైనార్టీ సెక్రటరీ అబ్దుల్ అనీఫ్ మహమ్మద్ జాఫ్రూపల్లాహ్, మహమ్మద్ గౌస్, ఎస్ కే యాసీన్ బాబా, ఎస్ కే రఫీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముస్లిం యంగ్ మెన్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అబ్దుల్ చిన్న రెహమాన్ మాట్లాడుతు సుమారు గత 15 ఏళ్లుగా తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా ప్రతి ఏటా ఉచిత ఖత్నా నిర్వహిస్తునామని తెలిపారు. ఖత్నా నిర్వహించడం వలన ఎన్నో వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చునన్నారు. ఐ హెచ్ ఫరూఖి మాట్లాడుతు ఖత్నా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న నేపథ్యంలోముస్లిం బాలురకు ఖత్నా ఆపరేషన్ లు ముస్లిం యంగ్ మెన్ అసోసియేషన్ ప్రతి ఏటా నిర్వహించడం అభినందనందనీయం అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి విశాఖ ముస్లిం యంగ్ మాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబ్దుల్ చిన్నరెహమాన్ మరియు వజీర్ రహమాన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!