జీతాలు అందక ఇబ్బంది పడుతున్న వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది
నేషనల్ హెల్త్ మిషన్ వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందికి ఏప్రిల్ నెల జీతాలు ఈరోజు 15వ తేదీ అయినా జీతాలు అందక ఇబ్బంది పడుతున్న ఉద్యోగస్తులు. వారం రోజుల్లో పడతాయని జిల్లా అధికారులు చెప్పిన నేటికీ పడక చాలా ఇబ్బంది తీవ్ర ఆందోళన కూడా గురవుతున్న నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు. నెలలో 15 రోజులు అవుతున్నప్పుడు ఇప్పుడు నేషనల్ హెల్త్ మిషన్ స్టేట్ ఆఫీస్ వాళ్ళు ఆధార్ సీడింగ్ మరియు (npci) నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మ్యాపింగ్ చేయించుకోమని చెప్పడం జరిగింది. ఇప్పుడు మ్యాపింగ్ చేస్తే ఎప్పుడు జీతాలు పడతాయి మేము ఎప్పుడు ఇంటి అద్దులు కట్టుకోవాలి. మేము ఎప్పుడు ఇంట్లో నిత్యవసర వస్తువులు కొనుక్కోవాలి అని నేషనల్ హెల్త్ మిషన్ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజుల నుంచి జీతాలు ఎప్పుడు పడతాయంటే ఆఫ్టర్నూన్ పడతాయి, సాయంత్రం పడతాయి, నైట్ కి పడతాయని వారం రోజులనుంచి చెప్పుతూ వస్తున్నారు అలా చూస్తూ ఉన్నారు ఉద్యోగస్తులు .కానీ జీతాలు పడడం కనబడడం లేదు. ఇంకెప్పుడు పడతాయి అని ఎదురు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు తీరా చూస్తే నేషనల్ హెల్త్ మిషన్ స్టేట్ ఆఫీస్ నుంచి అందరికీ ఆధార్ సీడింగ్ npci అయితే గాని జీతాలు వేయమని చెప్పడం జరిగింది. నేషనల్ హెల్త్ మిషన్ లో వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ వాళ్లకు కొంతమందికి ఇప్పటికి జీతాలు పడ్డాయి, అలాగే mlhp(cho) వాళ్లకు కొంతమంది కూడా జీతాలు పట్టే కేవలం UPHC (పట్టణ ఆరోగ్యంలో పనిచేస్తున్న సిబ్బందికి మరియు నేషనల్ టీబీ ప్రోగ్రామ్ సిబ్బందికి, కొంతమంది కేజీహెచ్, విజిహెచ్ ప్రాథమిక ఆరోగ్య పని చేస్తున్న నర్స్ లు కు , సిబ్బందికి అలాగే కంటి హాస్పిటల్లో పనిచేస్తున్న ఆప్తాన్మిక్ ఆఫీసర్లకి, NCD డిపార్ట్మెంట్ వాళ్లకి కొన్ని కేడర్ వాళ్లకి జీతాలు అందలేదు. ఇంచుమించు సుమారుగా 6000 మంది పైగా జీతాలు బకాయిలు ఉన్నాయి అంటూ తమకు త్వరగా జీతాలు ఇప్పించవలసిందిగా జిల్లా అధికారులకు రాష్ట్ర అధికారులను కోరుతున్నారు.




