రాజకీయాలువిశాఖపట్నం
జీవీఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్లు సామాన్యులకే : ప్రియాంక దండి

జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ టిక్కెట్లు సామాన్యులకే కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి తెలిపారు.
సామాన్యులు, యువత, మహిళలు తమ నిజ జీవితంలో అనేక కష్టాలు పడుతున్నారని, వారే సమాజంలో మార్పు తీసుకురాగలరని, ప్రజా సమస్యలు పరిష్కరించగలరని తాను నమ్ముతున్నానని ఆమె అన్నారు.
అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తూ టిక్కెట్లు కేటాయిస్తామని, నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారికి తొలిప్రాధాన్యత ఇస్తామని ఆమె స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండాలని, అధికార పార్టీ నాయకులను ఎదుర్కొని ప్రజలకు మంచి నాయకత్వం అందించే వారికి ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామని ప్రియాంక దండి తెలిపారు.




