ఐ హెచ్ ఫరూఖి ఇంటికి వై వి సుబ్బారెడ్డి వధూవరులను ఆశీర్వదించిన వైవి సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి

విశాఖపట్నం/ఆగష్టు 30 విశాఖపట్నం లొ గల వై ఎస్ ఆర్ సీపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఐ హెచ్ ఫరూకి ఇంటికి, రాజ్యసభ సభ్యులు వై వి సుబ్బారెడ్డి, ఉత్తరాంధ్ర జిల్లాల కొ ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, ఎంపీ గొల్ల బాబురావు, వై ఎస్ ఆర్ సీపి విశాఖ జిల్లా అధ్యక్షులు కెకె రాజు ఆదివారం సందర్శించారు. ముందుగా వై వి సుబ్బారెడ్డి ని ఐ హెచ్ ఫరూకి కుటుంబ సభ్యులు వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి సాధారంగా ఆహ్వానించారు. ఇటీవల వివాహం చేసుకున్న ఐ హెచ్ ఫరూకి కుమార్తె వదువరులను వై వి సుబ్బారెడ్డి, కురసాల కన్నబాబు,ఎంపీ గొల్ల బాబురావు, వై ఎస్ ఆర్ సీపి విశాఖ జిల్లా అధ్యక్షులుు కె కె రాజు ఆశీర్వదించారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి ఐ హెచ్ ఫరూఖి కుటుంబ సభ్యులతో కాసేవు ముచ్చటించారు. ఈ కార్యక్రమం లొ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, వై ఎస్ ఆర్ సీపి గాజువాక ఇంచార్జి తిప్పల దేవన్ రెడ్డి, పెడాడ రమణి కుమారి, పీవీ సురేష్, రవిరాజు, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.




