విశాఖపట్నం
గాజువాకలో విషాదం భవనం స్లాబ్ కూలి ఒకరి మృతి

మే03 ఆదివారం: గాజువాక వికాస్ నగర్‌లో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం సంభవించింది.ఒక ఇంటిని జాకీల సహాయంతో పైకి లేపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు స్లాబ్ కుప్పకూలింది.ఈఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా,మరో ఏడుగురు స్లాబ్ కింద చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న న్యూ పోర్ట్ పోలీసులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.




