కైలాసపురం కస్తూరి నగర్లో కొండచరియలు విరిగిపడిన ఘటన ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తో పాటు కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ కమిషనర్ కేతన్ కార్గ్, ఎమ్మార్వో ప్రసాద్, జోనల్ కమిషనర్ రాము

విశాఖపట్నం: విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం 46వ వార్డు పరిధిలోని కైలాసపురం కస్తూరి నగర్లో ఈరోజు కొండచరియలు విరిగిపడిన ఘటన చోటుచేసుకుంది.
సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ , జీవీఎంసీ కమిషనర్ కేతన్ కార్గ్ , ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ పి. విష్ణుకుమార్ రాజు , ఆర్డీవో గీత సంగీత్ మాధురి ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు , అక్కడ నివసిస్తున్న ప్రజల భద్రతపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ప్రాంతాలను గుర్తించి అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వర్షాలు మరియు ఇతర పరిస్థితుల కారణంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాము , ఎమ్మార్వో ప్రసాద్, జీవీఎంసీ అధికారులు, స్థానిక నాయకులు కొండ ప్రసాద్, దానేష్, పైడికొండ తదితరులు పాల్గొన్నారు.




