విశాఖపట్నం

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తక్షణమే అమలు చేయాలి– అధికారులకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం. అభిషిక్త్ కిశోర్ ఆదేశాలు

విశాఖపట్నం, అక్టోబర్ 14: ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తక్షణమే అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు, హోర్డింగ్‌లను వెంటనే తొలగించాలని, విగ్రహాలకు ముసుగులు వేయడంతోపాటు శిలాఫలకాలు, ఇతర ఫలకాలపై పేర్లు కనిపించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎన్నికల నిర్వహణకు అవసరమైన స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లు (ఎస్‌ఎస్‌టీ), ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి పర్యవేక్షణ బృందాలు (ఎంసీసీ), ఎన్నికల వ్యయ పర్యవేక్షణ బృందాలను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌ల ఏర్పాట్లకు సంబంధించి రూట్ మ్యాప్‌లతో కూడిన సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

గత ఎన్నికల అనుభవాలు, నిర్దేశిత ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి, సంబంధిత నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన అన్ని ముందస్తు ఏర్పాట్లను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!