మతంవిశాఖపట్నం

హాజరత్ ఇషాక్ మదని ఔలియా కు చాదర్ సమర్పణ

విశాఖపట్నం/జూన్ 25  వన్ టౌన్ ప్రాంతం, కోటవీధి లో వున్న అతి పురాతన మైన హాజరత్ ఇషాక్ మదని ఔలియా దర్గా 769 వ ఉత్సవం పురస్కరించుకొని పలువురు వై ఎస్ ఆర్ సిపి ముస్లిం మైనార్టీ నేతలు హాజరత్ ఇషాక్ మదని ఔలియా దర్గాను దర్శించుకున్నారు. వై ఎస్ ఆర్ సీపీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఐ హెచ్ ఫరూకి, వై ఎస్ ఆర్ సీపీ విశాఖ జిల్లా మైనార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ బర్కత్ అలి, విశాఖ జిల్లా మాజీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్,మరియు వై ఎస్ ఆర్ సీపీ మైనారిటీ సెల్ స్టేట్ జెనరల్ సెక్రటరీ కే వి బాబా, రాష్ట్ర యువజన అధికార ప్రతినిధి, మాజీ కార్పొరేటర్ మహామ్మద్ ఇమ్రాన్, వై ఎస్ ఆర్ సీపీ వార్డు అధ్యక్షులు షౌకత్ అలి,వై ఎస్ ఆర్ సీపీ 39వ వార్డు అధ్యక్షులు ముజీబ్ ఖాన్, వై ఎస్ ఆర్ సీపీ జిల్లా మైనార్టీ సెల్ సెక్రటరీ నిజాం (కరీం), వైస్సార్ సీపీ జిల్లా మైనార్టీ సీనియర్ నాయకులు బాష తదితరులు విచ్చేసి హాజరత్ ఇషాక్ మదని ఔలియా వారి మజార్ పై సందల్ పూసి,పవిత్ర చాదర్ కప్పి, గులాబి పుష్పాలు సమర్పించారు. అనంతరం ప్రపంచ శాంతి కోసం, అల్లాహ్ ను ప్రార్ధించారు. ఈ సందర్బంగా బర్కత్ అలి మాట్లాడుతు తన సొంత నిధులతో గత ఐదు నెలల నుండి దర్గా అభివృద్ధి, మరమత్తులు చేపడుతున్నానని తెలిపారు.ఈ మేరకు దర్గా కమిటీ సభ్యులు లతీఫ్, ఎస్ కె అహమ్మద్, అసిఫ్, హబీబ్ వై ఎస్ ఆర్ సీపీ మైనార్టీ నేతలకు శాలువ కప్పి ఘనంగా (గుల్ ఫోషి) సత్కరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!