రాజకీయాలువిశాఖపట్నం
మహమ్మద్ నజీర్ కు చిన్నూరు మసీదులో ఘన సన్మానం

విశాఖపట్నం మే 08 :నగరంలో 26వ వార్డ్ చిన్నూరు మస్జీద్ ఎ నూర్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమితులైన మహమ్మద్ నజీర్ కు మసీదు కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నమాజు అనంతరం సాలువతో కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు .ఈ సందర్భంగా 26 వ వార్డు టిడిపి అధ్యక్షుడు ముక్కా కిషోర్ ను కమిటీ సభ్యులు అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ తను ముస్లిం మైనారిటీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం మైనారిటీలు మాట్లాడుతూ మొహమ్మద్ నజీర్ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారని భవిష్యత్తులో నజీర్ ఉన్నత శిఖరాల అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు ప్రెసిడెంట్ గొప్ప ధర్మారావు, గౌస్, పెద్ద ఎత్తున ముస్లిం మైనారిటీలు పాల్గొన్నారు.




