రాష్ట్రం

పదవీ విరమణ పొందిన హోంగార్డుకు అండగా అనకాపల్లి జిల్లా పోలీస్: రూ. 3.94 లక్షల ఆర్థిక సాయం అందజేసిన ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ 

అనకాపల్లి, సెప్టెంబర్ 16: పోలీస్ శాఖలో నాలుగు దశాబ్దాల పాటు విశేష సేవలందించి పదవీ విరమణ పొందిన హోంగార్డుకు తోటి సిబ్బంది అండగా నిలిచి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. అనకాపల్లి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో మరియు అనకాపల్లి ట్రాఫిక్ విభాగంలో హోంగార్డుగా విధులు నిర్వహించి ఇటీవల రిటైర్ అయిన కె.మురళీకృష్ణకు, జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ బుధవారం తన కార్యాలయంలో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ​అనకాపల్లి మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని హోంగార్డులు తమ ఒకరోజు డ్యూటీ అలవెన్స్‌ను స్వచ్ఛందంగా విరాళంగా సేకరించారు. ఇలా సేకరించిన రూ.3,94,215/- విలువైన చెక్కును ఎస్పీ  మురళీకృష్ణకు అందజేసి, ఆయన విశ్రాంత జీవనం సుఖసంతోషాలతో గడవాలని ఆకాంక్షించారు.

​ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.

మురళీకృష్ణ తన విధులను ఎంతో నిబద్ధతతో, క్రమశిక్షణతో నిర్వహించారు. పదవీ విరమణ పొందిన సహోద్యోగికి ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో తోటి హోంగార్డులు చూపిన చొరవ మరియు వారి సేవా స్ఫూర్తి అభినందనీయం” అని కొనియాడారు. ​ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ వెంకటలక్ష్మి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!