విశాఖపట్నం
హజరత్ ఖ్వాజా గరీబ్ నవాజ్ హజరత్ ఖాదర్ వలీ హజరత్ కరిముల్లా ఔలియా వారి నిషాని పునర్నిర్మాణ కార్యక్రమం

సెప్టెంబర్ 28 సోమవారం : జీవీఎంసీ 44 వార్డ్ ముస్లిం తాటిచెట్ల పాలెం లో ఉన్న హజరత్ ఖ్వాజా గరీబ్ నవాజ్, హజరత్ ఖాదర్ వలి, హజరత్ కరీముల్లాషా ఔలియా, వారి నిషాని ఉన్న విషయం అందరికీ తెలిసినదే. ఈ నిషాని పునః నిర్మాణ కార్యక్రమం లో భాగంగా సోమవారం నాడు ఉదయం హజరత్ ఖాదరవలి కమిటీ ఆధ్వర్యంలో మస్జీద్ ఎ క్యూబా మత గురువు మొహమ్మద్ ముస్తేజాబ్ వారు చేతుల మీదుగా ప్రత్యేక ప్రార్థనలు జరిపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హజరత్ ఖాదర్ వలీ కమిటీ అధ్యక్షులు షేక్ మదీనా (బంటి), సెక్రటరీ మహమ్మద్ ఇమ్రాన్,ఖ్వాజా,మహమ్మద్ కరీమ్(నిజాం), కేటరింగ్ ఖాజా, షేక్ బాషా, ,బిల్డర్ చోట ,షేక్ గౌస్ ,అబ్దుల్ హఫీజ్, జిలాని ,కరీమ్,ఆషిక్ రజ్జాక్ , చోట, తదితరులు పాల్గొన్నారు.




