విశాఖపట్నం

రానున్న గ్రేటర్ విశాఖ జీవీఎంసీ ఎన్నికల్లో ముస్లిం లకు అధిక శాతం కార్పొరేటర్ల సీట్లు కేటాయించాలి  ముస్లిం మైనార్టీ నాయకులు డిమాండ్

విశాఖపట్నం/అక్టోబర్ 13(ట్రూ న్యూస్ ) రానున్న గ్రేటర్ విశాఖ జీవీఎంసీ ఎన్నికలలో ముస్లింలకు అధిక శాతం కార్పొరేటర్ల సీట్లు కేటాయించాలని దొండపర్తి లో ఓ కల్యాణ మండపములో జిల్లా వైసీపీ నేతలు మంగళవారం సమావేశం నిర్వహించారు.మాజీ కార్పొరేటర్, విశాఖ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు హాజీ బర్కత్ అలి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో

రాష్ట్ర వైసీపీ ఎస్ ఈ సీ సభ్యులు ఐ హెచ్ ఫరూకి,, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు బర్కత్ ఆలీ మాట్లాడుతూ రానున్న గ్రేటర్ విశాఖ ఎన్నికలలో ముస్లింలకు ప్రాధాన్యత కల్పించాలని,విశాఖ మేయర్ సీట్ ముస్లిం సామాజిక వర్గానికి కేటాయించాలన్నారు.ముస్లిం లకు 10% రిజర్వేషన్ ద్వారా చుస్తే 5 సీట్లు కేటీసియించడంతో ముస్లిం లకు న్యాయం చేకూరుతుందన్నారు. ఇదే కాకుండా ముస్లింల ఓట్లు ఉత్తరనియోజకవర్గం, దక్షిణ నియోజకవర్గం, పెందుర్తి తూర్పు నియోజకవర్గం లో ముస్లిం లు అధికంగా వున్నారని అన్నారు. స్వర్గీయ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గ వున్నప్పుడు,ముస్లిం లు అంతా ఆయన వెంటే వున్నారని, ఆయన తనయుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాపించినప్పటినుండి ముస్లిం లు అంతా ఆయన వెన్నంటే ఉన్నారని అన్నారు. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో 5 సీట్లు కాకుండా ఎ వార్డులో ముస్లింలు అధికంగా వున్నారో ఆయా వార్డులకు కార్పొరేటర్ సీట్లు ఇవ్వాల్సిందిగా వై ఎస్ ఆర్ పార్టీ ఉత్త్రారాంద్ర పరిశీలకుకు కురసాల కన్నబాబు ను, శాసన మండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ ను విశాఖ జిల్లా వై ఎస్ ఆర్ సీపి అధ్యక్షులు కే కే రాజు ను ఈ సందర్బంగా ఈ సమావేశంలో కోరారు.

కార్యక్రమంలో.మాజీ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ మైనార్టీ జెనరల్ సెక్రటరీ కె వి బాబా, మాజీ కో ఆఫ్సన్ మెంబెర్ షరీఫ్, ఇంటెలెక్చ్యువల్ విశాఖ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మార్కండేయులు,ఉత్తర నియోజకవర్గం ఆర్టీఐ విభాగం అధ్యక్షులు, 44వ వార్డు పరిశీలకులు షేక్ బాబ్జి, షబిర బేగం, వై ఎస్ ఆర్ సీపి 36వ వార్డు అధ్యక్షులు ముజీబ్ ఖాన్, ఎం డి గౌస్, ఎం డి కరీం, నాజీమ్ అబ్బాస్,ఎం డి మకుబూల్, ముస్తఫా, ఎస్ కె బాషా, బాషా బాష, బిలాల్ తదితర ముస్లిం నాయకులు పాల్గున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!