మెరుగైన ఆరోగ్యానికి వ్యాయామం అవసరం టెంపుల్ ఫిట్నెస్ వ్యాయామశాల ప్రారంభం.. ముఖ్యఅతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి

ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని, మంచి ఆహారంతో పాటు శరీరానికి వ్యాయామం అవసరమని పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. జీవీఎంసీ 33వ వార్డు కెప్టెన్ రామారావు జంక్షన్ అల్లిపురం రోడ్డులో టెంపుల్ ఫిట్నెస్ వ్యాయామశాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రిబ్బన్ కటింగ్ చేసి వ్యాయామ పరికరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్న యువత లో మార్పు తీసుకువచ్చేందుకు ఇటువంటి వ్యాయామశాలలు ఎంతగానో దోహదపడతాయన్నారు. శరీర దారుఢ్యానికి రోజులో ఒక గంట సేపు వ్యాయామం చేస్తే షుగర్ బీపీ వంటివి కంట్రోల్లో ఉంటాయన్నారు. నగరంలో ఉన్న ఫిట్నెస్ సెంటర్లు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పోలీస్ కమిషనర్ తో పాటు 33వ వార్డ్ మాజీ కార్పొరేటర్ బీశెట్టి వసంతలక్ష్మి, జనసేన నేత బీశెట్టి గోపి, రాష్ట్ర బాడీ బిల్డింగ్ ఫౌండర్ కే గురునాథరావు, సెక్రెటరీ టి రాము, వ్యాయామశాల నిర్వాహకులైన టి రవి, టీ నూకరాజునీ అభినందించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ముఖ్యంగా తమ ఆహ్వానాన్ని మన్నించి హాజరైన నగర పోలీస్ కమిషనర్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ప్రభుత్వ కాంపిటేషన్ పోటీలకు యువతకి అవసరమైన ఫిట్నెస్ అందించేందుకు తమ వ్యాయామ శిక్షణశాల ఎప్పుడు ముందుంటుందన్నారు. యువతను మంచి మార్గంలో తీసుకువచ్చేందుకు ఫిట్నెస్ సెంటర్ ద్వారా సేవలందిస్తామన్నారు. శరీరం అనేది ఒక ఆలయం అని, అందుకే టెంపుల్ ఫిట్నెస్ అని నామకరణం చేశామన్నారు.




