విశాఖపట్నం

ఉమ్రా యాత్రికుడికి ఘన సత్కారం

ఆగస్టు 22 శనివారం ట్రూ న్యూస్ : జీవీఎంసీ 44 వ వార్డు ముస్లిం తాటిచెట్ల పాలెంలో ఉమ్రా యాత్రకు వెళుతున్న అబ్దుల్ హఫీజ్ ను హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు షేక్ బాషా ఆధ్వర్యంలో, విశాఖ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ సెక్రెటరీ మహమ్మద్ కరీం, వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అయ్యుబ్ సారద్యంలో పూలమాల వేసి శాలువాతో  ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అబ్దుల్ హఫీజ్ మాట్లాడుతూ దైవ గృహం కాబాయాత్రకు వెళ్లడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ జిలాని, మహమ్మద్ గౌస్,, మహమ్మద్ ఖాజా, ఖాదర్ వలీ  (కిట్టు), షేక్ మదీనా(బంటి), మహమ్మద్ ఇమ్రాన్, ఆన్సర్ వలి, ఆషిక్, షేక్ షబ్బీర్, ఖాదర్ వలీ,,చోటే, ఆజాం తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!