మతంవిశాఖపట్నం

మహమ్మదియా మసీదు లో వాటర్ ఫాంటేషన్ ప్రారంభం ముఖ్య అతిధిగా పాల్గొన్న ఐ హెచ్ ఫారుఖి

విశాఖపట్నం /ఫిబ్రవరి 25 : విశాఖపట్నంలో వున్న చిన వాళ్తేర్ మహమ్మదియా మసీదులో వాటర్ ఫౌంటేష్ ను ఎ క్యూ జె విద్యాసంస్థలం డైరెక్టర్ ఐ హెచ్ ఫరూకి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. ముందుగా. మసీదు హఫీజ్ మత గురువు ఖురాన్ పారాయణం, దైవ నామ సంకల్పం చదివి అల్లాహ్ ను ప్రార్ధించారు. ఈ సందర్బంగా ఐ హెచ్ ఫరూకి మాట్లాడుతు మసీదు నూతన కార్యవర్గం ఏర్పడి ఆరు నెలలు కావస్తోందని మసీదు అభివృద్ధి కి, ఈ పవిత్ర రంజాన్ మాసం లో రోజా దారులకు కొత్త కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేయటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అనేక ఏళ్లుగా రోజా దారులకు రంజాన్ మాసం లో వేకువ జామున సెహరి ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. వ కలర్ ఫుల్ విద్యుత్ కాంతులు మహమ్మదియ మసీదు కు ఏర్పాటు చేయటం పట్ల ఐ హెచ్ ఫరూకి ఆనందం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమం లో మసీదు అధ్యక్షులు షరీఫ్, కార్యదర్శి ముస్తఫా కమిటీ సభ్యులు, పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అనంతరం నమాజ్ ఆచరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!