రాజకీయాలువిశాఖపట్నం

నైట్ ఫుడ్ కోర్ట్ బాధితులకు మద్దతుగా కె.కె రాజు

మార్చి 31మంగళవారం : నైట్ ఫుడ్ కోర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెంట్రల్ పార్క్ వద్ద తొలగించబడిన నైట్ ఫుడ్ కోర్టును వెంటనే పునఃస్థాపించాలనే డిమాండ్‌తో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కె కె రాజు మద్దతు తెలిపారు…

ఈ సందర్భంగా కె.కె రాజు  మాట్లాడుతూ ..
విశాఖపట్నం నగరానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించడానికి, అలాగే స్థానిక సాంప్రదాయ ఆహార సంస్కృతిని ప్రోత్సహించడానికి నైట్ ఫుడ్ కోర్టులు ఎంతో కీలకమని అన్నారు. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి వర్గాలకు చెందిన స్వయం ఉపాధి పొందిన వ్యక్తులకు ఈ ఫుడ్ కోర్టులు జీవనాధారంగా మారాయని తెలిపారు…

🔹 మాజీ ముఖ్యమంత్రి ✨వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, పెద్దలు, అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా ఈ నైట్ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయబడ్డాయని గుర్తు చేశారు. వ్యాపారులు కష్టపడి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, పర్యాటకులకు సేవలు అందిస్తూ నగర టూరిజం అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి ప్రత్యామ్నాయం లేకుండా ఈ నైట్ ఫుడ్ కోర్టును తొలగించడం వల్ల, అక్కడ పనిచేసే వందలాది మంది జీవనోపాధి కోల్పోయారని విమర్శించారు. గత ఆరు నెలలుగా వారి సమస్యను పట్టించుకోకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. తక్షణమే నైట్ ఫుడ్ కోర్టును పునరుద్ధరించి, బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైతే జిల్లా కలెక్టర్ , కమిషనర్ లను కలిసి ఈ సమస్యను తెలియజేస్తామని, పరిష్కారం లభించకపోతే జీవీఎంసీ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమలో విశాఖ తూర్పు నియోజకవర్గం మొల్లి అప్పారావు, నియోజకవర్గ పరిశీలికలు బాణాల శ్రీనివాసరావు, పేడాడ రమణకుమారి , రాష్ట్ర అధికార పత్రినిది కొండా రాజీవ్ గాంధి , రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పళ్ళ దుర్గ , జోనోల్ , జిల్లా చెన్న సునీల్ , ముత్తం సునీల్ , బొండా ఉమామహేశ్వరరావు , పిలా ప్రేమ కిరణ్, దేవర్ మర్కదేయలు , జిల్లా అధికార ప్రతినిధి గోవింద్ , వార్డు అధ్యక్షులు చొల్లింగ్ నాగేశ్వరరావు , రమన్ రెడ్డి , దొప్ప శ్రీను , నియోజకవర్గం అధ్యక్షులు మువ్వల సంతోష్ , హరి కృష్ణ , కొట్యడ సూర్య, పోలి రెడ్డి , అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కాంత్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!