లెజెండరీ గాయని ఎస్. జానకి మృతిపై వైయస్ జగన్ సంతాపం

తాడేపల్లి/జులై 11(ట్రూ న్యూస్ ) : భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని శ్రీమతి ఎస్. జానకి గారి మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.
దక్షిణ భారత సినీ సంగీత రంగంలో దశాబ్దాల పాటు తన గాన ప్రతిభతో చెరగని ముద్ర వేసిన ఎస్. జానకి సంగీత సరస్వతిగా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైయస్ జగన్ పేర్కొన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు ఆలపించి, భారతీయ సంగీత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించారని కొనియాడారు.
తన స్వరంతో ఎన్నో తరాలను అలరించిన ఎస్. జానకి గారి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని వైయస్ జగన్ అన్నారు. ఆమె పాడిన పాటలు, ఆమె అందించిన సంగీత వారసత్వం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఎస్. జానకి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించిన వైయస్ జగన్, ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రియులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.



