కెకె రాజు ఆధ్వర్యంలో విశాఖ జిల్లా సోషల్ మీడియా మరియు ఐటీ వింగ్ సమావేశం

- వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా & ఐటీ వింగ్ కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది!
- పార్టీలో సోషల్ మీడియా & ఐటీ వింగ్ కార్యకర్తలకు సముచిత గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుంది.
- స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి సోషల్ మీడియా & ఐటీ వింగ్ కార్యకర్తలంతా కృషి చేయాలి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె. రాజు అధ్యక్షతన, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా & ఐటీ వింగ్ సమావేశం సోమవారం మద్దిలపాలెంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం సోషల్ మీడియా & ఐటీ వింగ్ వేదికగా పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. పార్టీ విధానాలను, ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోషల్ మీడియా & ఐటీ వింగ్ కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు…
వైఎస్సార్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ… రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి సోషల్ మీడియా & ఐటీ వింగ్ కార్యకర్త క్షేత్రస్థాయి నుంచి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వార్డు స్థాయి నుంచి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని సూచించారు.
జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె. రాజు మాట్లాడుతూ… విశాఖ జిల్లాలో వైఎస్సార్ సీపీ కోసం పనిచేస్తున్న ప్రతి సోషల్ మీడియా & ఐటీ వింగ్ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని, కార్యకర్తలు ఎదుర్కొనే ఇబ్బందుల పరిష్కారానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం సోషల్ మీడియా & ఐటీ వింగ్ కార్యకర్తలకు సముచిత గుర్తింపు, ప్రాధాన్యత కల్పిస్తామని పేర్కొన్నారు.
జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు బొండా ఉమామహేశ్వరరావు గారు మాట్లాడుతూ… విశాఖ జిల్లాలోని నియోజకవర్గాలు, మండలాలు, వార్డు స్థాయిలో సోషల్ మీడియా & ఐటీ వింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, ప్రజా సమస్యలను సమర్థవంతంగా ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
🔸️ఈ సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్ గారు, కరణం ధర్మశ్రీ గారు, అదీప్ రాజ్ , కంబాల జోగులు , మొల్లి అప్పారావు , తిప్పల దేవన్ రెడ్డి , బొత్స అనూష , మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్‌కుమార్ , చింతలపూడి వెంకట్రామయ్య , తూర్పు నియోజకవర్గం పరిశీలకులు పేడాడ రమణి కుమారి పాల్గొన్నారు.
🔸️అలాగే నియోజకవర్గాల సోషల్ మీడియా & ఐటీ వింగ్ అధ్యక్షులు కొట్యాడ సూర్య, సంపత్, సంతోష్, పోలిరెడ్డి, బెవర మహేష్, అనిల్ శర్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు గోపీరాజ్ వంక, బెవర జగదీష్, మోహన్, లీలా, గీతారెడ్డి, జిల్లా సోషల్ మీడియా & ఐటీ వింగ్ కమిటీ సభ్యులు, వార్డు సోషల్ మీడియా & ఐటీ వింగ్ అధ్యక్షులు, సోషల్ మీడియా & ఐటీ వింగ్ కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు….




