అగ్ర వార్తలుమతం
అజాన్ ఇచ్చిన కొద్దిసేపటికి ముఅజ్జిన్ ఇబ్రహీం అల్ మదనీ కన్నుమూత

ట్రూ న్యూస్ సౌదీ అరబ్ మక్కాషరీఫ్ సెప్టెంబర్ 21 సోమవారం : పవిత్ర మస్జిద్ అల్ హరమ్ ముఅజ్జిన్ షేక్ ఇబ్రహీం బిన్ ఆదిల్ హమ్జా అల్ మదని సోమవారం కన్నుమూశారు. చివరిసారిగా అజాన్ ఇచ్చిన కొద్దిసేపటికే ఆయన మరణించినట్లు ఇన్ సైడ్ ద హరమైన్ తన ఎక్స్ ఖాతాలో తెలిపింది. అసర్ అనంతరం జనాజా నమాజ్ నిర్వహించి అల్ ముఅల్ల స్మశాన వాటికలో ఖననం చేశారు. 1976లో మదీనాలో జన్మించిన షేక్ ఇబ్రహీం అల్ మదనీకి అజాన్ తో అనుబంధం 15 ఏళ్ల వయసులోనే ప్రారంభమైంది. అప్పటినుంచి అజాన్ సేవలు కొన సాగిస్తూ అనంతరం అనంతరం మస్జిద్ హారామ్ ము అజ్జిన్ గా సేవలందించారు.




