విశాఖపట్నం

తాజ్ బాగ్ మస్జీద్ లో ఘనంగా బార్వి షరీఫ్

విశాఖపట్నంసెప్టెంబర్ 18(ట్రూ న్యూస్ ) ఇస్లామిక్ సాంప్రదాయంలో “బార్వీ షరీఫ్” లేదా “బారహ్వీ షరీఫ్” అనేది అత్యంత పవిత్రమైన రోజు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మూడవ నెల అయిన రబీ-ఉల్-అవ్వల్ 12వ తేదీన దీనిని జరుపుకుంటారు. ఈ రోజుకు ముస్లిం సమాజంలో ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మేరకు విశాఖపట్నం, అక్కయ్యపాలెం జాతీయ రహదారి సమీపంలో వున్న ఖాన్ కహీ మస్జీద్ ఎ తాజ్ బాగ్ లో శుక్రవారం బార్మి షరీఫ్ వేడుకలు అత్యంత భక్తి శ్రద్దలతో మస్జీద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. జుమ్మా నమాజ్ సందర్బంగా దీని యొక్క ముఖ్య విశేషాలు మరియు ప్రాముఖ్యత విశాఖపట్నం పరిధిలో వున్న అహమ్మద్ నగర్ కు చెందిన మౌలానా ఇస్మాయిల్ ఉర్దూ లో వివరిస్తూ ప్రవక్త ముహమ్మద్ జన్మదినం (మిలాద్-ఉన్-నబి),ఇస్లాం ప్రవక్త అయిన హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ పవిత్రమైన రోజునే జన్మించారని,అందువల్ల ఈ రోజును ప్రవక్త జన్మదినోత్సవంగా (ఈద్ మిలాద్-ఉన్-నబి) ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు అన్నారు..కృతజ్ఞత మరియు సంతోషం,మానవాళికి సరైన మార్గాన్ని చూపించడానికి ప్రవక్తను పంపినందుకు అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ రోజున ముస్లింలు ఎంతో సంతోషాన్ని, ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తారని తెలియజేసారు..ఆధ్యాత్మిక సభలు (మిలాద్ మహిఫిల్స్ ఈ రోజున మసీదులలో మరియు ఇళ్లలో ప్రత్యేక ప్రార్థనలు, ఆధ్యాత్మిక సభలు నిర్వహిస్తారన్నారు.ప్రవక్త జీవిత చరిత్ర (సీరత్-ఉన్-నబి), ఆయన చేసిన బోధనలు మరియు ఆయన గొప్పతనాన్ని కొనియాడుతూ నాత్ (కవితలు) పఠిస్తారని,.దానధర్మాలు మరియు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలియజేసారు.బార్వీ షరీఫ్ సందర్భంగా పేదలకు ఆహారం, బట్టలు పంచడం వంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడతారన్నారు.. సమాజంలో శాంతి, సోదరభావాన్ని పెంపొందించడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తారని .దీపాల అలంకరణ: ఉర్దూ/అరబిక్ భాషలో “బారహ్” అంటే పన్నెండు (12) అని అర్థం. ప్రవక్త రబీ-ఉల్-అవ్వల్ నెల 12వ తేదీన జన్మించినందున దీనికి ‘బార్వీ షరీఫ్’ అనే పేరు వచ్చిందని తెలియజేసారు.అనంతరం జుమ్మా కుత్బ,జుమ్మా నమాజ్, దువ,బార్వి షరీఫ్ ప్రత్యేక ఫాతేహ నిర్వహించి, అందరికి ఆమ్ దావత్ ఏర్పాటు చేసి, తబురుఖ్ పంచిపెట్టారు.ఈ కార్యక్రమం లో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!