విశాఖపట్నం

కేరళ లో జాతీయ షూటింగ్ రంగస్థలంపై నాసిర్ అలీ సంచలనం రెండు కాంస్యా పతకాలతో విజయం – మన ఆంధ్ర రాష్ట్ర తరపున విశాఖ యువ క్రీడాకారుడి సత్తా

విశాఖపట్నం యం వి పి కాలనీ కాలనీ కు చెందిన నాసిర్ అలీ  జాతీయ స్థాయిపై దృష్టి నగరానికి గర్వకారణంగా నిలిచిన ప్రతిభావంతుడు కేరళ లోని 17వ సౌత్ జోన్ రైపిల్ షూటింగ్ రేంజ్‌లో 2026 ఆగష్టు 31 నుండి ఈ నెల 9 వరకు ఘనంగా నిర్వహిస్తున్నా జాతీయ స్థాయి షూటింగ్ పోటీల్లో విశాఖపట్నం నగరానికి చెందిన యువ క్రీడాకారుడు నాసిర్ అలీ అద్భుత ప్రతిభ కనబరుస్తూ రెండు కాంస్యా పతకాలతో సంచలన విజయాన్ని నమోదు చేసి రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు.గతంలోకుడా భారీస్థాయిలోమన ఆంధ్ర రాష్ట్రం తరుపున జాతీయ స్థాయిలో ఈవెంట్లలో చాల పతకాలు సాధించిన విషయం అందరికీ తెలిసిందే. నాసిర్ అలీ పోటీల ప్రతి దశలోనూ అద్భుతమైన పోటీలలో ప్రతి షాట్‌లోనూ అతని లక్ష్యసాధన స్పష్టంగా కనిపించగా, సమయపాలన, క్రమశిక్షణ, శారీరక-మానసిక సమతుల్యత అతన్ని విజయపథంలో నిలబెట్టాయి. షేక్ జె తాయెబ్ బజాన్(కోచ్) సూచనలను కచ్చితంగా అమలు చేయడం, నిరంతర సాధనతో తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడం అతని విజయానికి ముఖ్య కారణాలుగా నిలిచాయి. చిన్న వయస్సులోనే షూటింగ్ క్రీడపై ఆసక్తి పెంచుకున్న నాసిర్ అలీ ప్రతిరోజూ కఠిన సాధన చేస్తూ, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాడు. కుటుంబ సభ్యుల నిరంతర ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత్వం అతనిలో విశ్వాసాన్ని పెంపొందించి విజయానికి దారితీశాయి.

నాసిర్ అలీ సాధించిన ఈ విజయాలు కేవలం వ్యక్తిగత గెలుపుకే పరిమితం కాకుండా, విశాఖపట్నం నగరానికి ప్రత్యేక గౌరవాన్ని తీసుకువచ్చాయి. అతని ప్రతిభపై కుటుంబ సభ్యులు, స్నేహితులు, గురువులు హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో అతను జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలపై భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

క్రీడా నిపుణులు మాట్లాడుతూ, “నాసిర్ అలీలో ఉన్న కచ్చితత్వం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ అతన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లగలవు. సరైన శిక్షణ, సదుపాయాలు లభిస్తే అతను దేశానికి కీర్తి తీసుకురావడం ఖాయం” అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అతన్ని అభినందిస్తూ, యువత క్రీడల వైపు ముందుకు రావడానికి నాసిర్ అలీ విజయాలు ప్రేరణగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. సమాజం నుంచి, ప్రభుత్వ సంస్థల నుంచి మరింత ప్రోత్సాహం లభిస్తే ఇలాంటి ప్రతిభావంతులైన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని వారు తెలిపారు.

ప్రస్తుతం నాసిర్ అలీ లక్ష్యం జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటుతూ, అంతర్జాతీయ షూటింగ్ రంగంలో భారతదేశానికి కీర్తి తీసుకురావడమే. అతని పట్టుదల, కృషి, క్రమశిక్షణ చూస్తే ఈ లక్ష్యం దూరంలో లేదని క్రీడా వర్గాలు విశ్వసిస్తున్నాయి.

నాసిర్ అలీ సాధించిన రెండు పతకాల ఘన విజయం విశాఖపట్నం నగరానికి మరింత గౌరవాన్ని తీసుకువచ్చింది. అతని విజయపథం మరింత వెలుగొందాలని ప్రజలు, అభిమానులు హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!