నేరంవిశాఖపట్నం
క్రికెట్ గొడవలో యువకుడి హత్య

విశాఖ,ఆరిలోవ,పెద్దగదిలిలో ఆదివారం సాయంత్రం క్రికెట్ గొడవ ఒక యువకుడి ప్రాణం తీసింది.పోలీసుల కథనం ప్రకారం..క్రికెట్ ఆడుతున్న సమయంలో అజిత్(23), కిషోర్(26) మధ్య వివాదం తలెత్తింది.మ్యాచ్ ముగిసిన తర్వాత కిషోర్ ఆగ్రహంతో పెద్దగదిలి జంక్షన్ వద్ద అందరూ చూస్తుండగానే అజిత్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన అజిత్ అక్కడికక్కడే మృతి చెందాడు.సిఐ మల్లేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




