విశాఖపట్నం
ఈ నెల 9,10న జరుగు హజరత్ ఖ్వాజా గరీబ్ నవాజ్ ఉర్సు ఉత్సవాలకు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ.సి.హెచ్ ఉమాకాంత్ కు ఆహ్వానం

విశాఖపట్నం జీవీఎంసీ 44వ వార్డు ముస్లిం తాటి చెట్ల పాలెంలో హజరత్ ఖాదర్ వలీ ఔలియా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 9,10న హజరత్ ఖ్వాజా గరీబ్ నవాజ్ ఉర్సు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. జనవరి 9 శుక్రవారం దైవ గ్రంథం ఖురాన్ పఠనం, సాయంత్రం చందనోత్సవ ఊరేగింపు, అనంతరం ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. జనవరి 10 శనివారం నాడు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులచే ప్రసంగం, అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరగనుంది. ఈ ఉర్సు ఉత్సవాలకు విశాఖ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ.సి.హెచ్.ఉమాకాంత్ ను కమిటీ సభ్యులు ఆహ్వానించారు.




