కెకె రాజు ఆధ్వర్యంలో వార్డుల డీలిమిటేషన్ పై అదనపు కమిషనర్ కు వినతి పత్రం

విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె. రాజు ఆధ్వర్యంలో నియోజకవర్గ సమన్వయకర్తలు,నియోజకవర్గ పరిశీలకులు,మాజీ కార్పొరేటర్లు, వార్డు పార్టీ అధ్యక్షులతో కలిసి జీవీఎంసీ పరిధిలోని 120 వార్డుల ఓటర్ల జాబితాలోని అభ్యంతరాలు,కులాల వారీగా ఓటర్ల వివరాలు,వార్డుల రిజర్వేషన్లకు సంబంధించిన అభ్యంతరాలపై జీవీఎంసీ అదనపు కమిషనర్ కు వినతిపత్రం సమర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి , మొల్లి అప్పారావు , శాసన మండలి సభ్యులు కుంభ రవిబాబు , మాజీ శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి , విశాఖ మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి మాజీ డిప్యూటీ మేయర్లు కటామురి సతీష్, జియ్యాని శ్రీధర్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, పార్టీ నాయకులు జహీర్ అహ్మద్,సతీష్ వర్మ, పళ్ళ దుర్గ, పి.వి. నారాయణ్,జి.వి. రవి రాజు,జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు,మాజీ కార్పొరేటర్లు,వార్డు పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.




