విశాఖపట్నం
7వ సారి — ఉత్తమ థీమ్-ఆధారిత రిసార్ట్ అవార్డు . ప్రపంచ పర్యాటక దినోత్సవం 2026లో గర్వించదగిన మరియు మరపురాని క్షణం – సన్రైజ్ రిసార్ట్స్ అధినేత రాజాబాబు

సెప్టెంబర్ 27 ఆదివారం ట్రూ న్యూస్ ప్రపంచ పర్యాటక దినోత్సవం 2026 లో భాగంగా సన్రైజ్ రిసార్ట్స్ అధినేత రాజాబాబు ఏడవసారి ఉత్తమ ధీమ్ ఆధారిత రిసార్ట్ అవార్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా అందుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం ఎక్సలెన్స్ అవార్డును అందుకోవడం చాలా గర్వకారణం అని అన్నారు. ఏడవసారి ఈ అవార్డును అందుకోవడం మరపురాని క్షణంగా ఆయన అభివర్ణించారు. ఈ అద్భుతమైన విజయం తమ ఉత్తమ ఏడవ గుర్తింపును సూచిస్తుందని అన్నారు. ఈ అవార్డు తమ చంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు.




