మతంవిశాఖపట్నం
ముస్లిం తాటి చెట్ల పాలెం (పెద్దూరు) లో మొహమ్మడియన్స్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా పహాలే గ్యార్వి షరీఫ్ వేడుకలు

జీవీఎంసీ 44వ వార్డు ముస్లిం తాటిచెట్లపాలెం (పెద్దూరు) లో మొహమ్మడియన్స్ యూత్ ఆధ్వర్యంలో ఇరాక్ బగ్దాద్ లో ఉన్న హజరత్ షేక్ అబ్దుల్ ఖాదర్ జిలాని ఔలియా వారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా పహాలే గ్యార్వి షరీఫ్ వేడుకలు అత్యంత ఆధ్యాత్మికంగా జరిగాయి. బుధవారం నాడు ఫజర్ నమాజు అనంతరం దైవ గ్రంథం ఖురాన్ పఠనం జరిగింది. సాయంత్రం 6:30 గంటలకు మగ్రిబ్ నమాజు అనంతరం ప్రత్యేక ప్రార్థనలు(ఫాతెహా దరూద్) జరిగాయి. అనంతరం అన్న ప్రసాద్ వివరణ కార్యక్రమం జరిగింది. వర్షంలోనూ గౌసుల్ఆ జమ్ వారి ఈ గ్యార్వి షరీఫ్ వేడుకలలో అత్యధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు.




