రాజకీయాలువిశాఖపట్నం
వైయస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కెకె రాజు. ఐడి కార్డును వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్న కెకె

తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని వైయస్సార్సీపి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కెకె రాజు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా పార్టీ నిర్మాణం, పార్టీ ఐడి కార్డుల పంపిణీ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు.ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి , విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ మొల్లి అప్పారావు పాల్గొన్నారు. ఐడీ కార్డును వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కెకె రాజు అందుకున్నారు




