మతంవిశాఖపట్నం
మస్జీద్ ఎ క్యూబా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఇమామ్ అహ్మద్ రజా ఖాన్ బరేల్వి వారి ఉర్సు వేడుకలు

జీవీఎంసీ 44 వార్డు ముస్లిం తాటి చెట్ల పాలెం మస్జీద్ ఎ క్యూబా లో మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఉత్తర ప్రదేశ్ లోని బరేల్వి లో ఉన్న ఆలేసున్నత్ వాల్ జమాత్ వారి ఇమామ్ అహ్మద్ రజా ఖాన్ బరేల్వివారి ఉర్సు సందర్భంగా శనివారం మసీదులో మధ్యాహ్నం 2:36 నిముషాలకు ఫాతేహా దరూధ్ ( ప్రత్యేక ప్రార్థనలు) జరిగాయి. రాత్రి ఇషా నమాజ్ అనంతరం మౌలానా ముస్తే జాబ్ వారి ప్రసంగం జరిగింది. ఈ ప్రసంగంలో మౌలానా ఇమామ్ అహ్మద్ రజా ఖాన్ వారు ఆయన జీవితంలో ఆయన నడిచిన విధానం అయన తెలిపిన సందేశాలు తదితర అంశాలను క్లుప్తంగా వివరించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్థానిక ముస్లింలు పాల్గొన్నారు.




