రాజకీయాలురాష్ట్రంవిశాఖపట్నం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి . కెకె రాజు డిమాండ్

జాతీయస్థాయిలో నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, అన్యాయలు ఎంత తీవ్రమైనవో ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ పరీక్షలోగాని , సెలక్షన్ లో గాని, మెరిట్ విషయం లో గాని జరిగిన అక్రమాలు వాటి కంటే తీవ్రమైనవి అని కెకె రాజు అన్నారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్థిలోకం చేసిన పోరాటానికి దిగివచ్చి కేంద్ర విద్యశాఖ మంత్రి రాజీనామా చేశారు ఆంధ్రప్రదేశ్ లో కూడా దగా డీఎస్సీ కి సంబంధించి, మేరిట్ లిస్ట్ లో, మరియు ఉపాధ్యాయ పోస్టులుకు సంబంధించి జరిగిన నగదు లావాదేవీలుకు బాధ్యత వహించి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని విశాఖ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు కెకె రాజు డిమాండ్ చేశారు




